Home న్యూస్ 32 కోట్ల రేటు….అయినా ఇలా చేస్తున్నారేంటి!

32 కోట్ల రేటు….అయినా ఇలా చేస్తున్నారేంటి!

0

విక్టరీ వెంకటేష్ మీనా ల కాంబినేషన్ లో 6 ఏళ్ల క్రితం వచ్చిన దృశ్యం సినిమా కి సీక్వెల్ గా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ దృశ్యం 2 ఒరిజినల్ వర్షన్ ఈ ఇయర్ మొదట్లో అమెజాన్ ప్రైమ్ లోనే డిజిటల్ రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది, దాంతో తెలుగు రీమేక్ పై అంచనాలు పెరగగా థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యి సందడి చేస్తుంది అనుకుంటే…

సినిమాను అమెజాన్ ప్రైమ్ లోనే రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ను డైరెక్ట్ రిలీజ్ కోసం మేకర్స్ కి ఏకంగా 32 కోట్ల భారీ రేటు చెల్లించి డైరెక్ట్ రిలీజ్ హక్కులను సొంతం చేసుకున్నారు ప్రైమ్ వీడియో వాళ్ళు. సినిమా టీసర్ ట్రైలర్ అనౌన్స్ మెంట్స్ కూడా…

చాలా సడెన్ సడెన్ గా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే, ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత అయినా ప్రమోషన్స్ బాగా చేస్తారు అనుకుంటే జస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టేసి సినిమా గురించి చెప్పి ఇక ఎలాంటి ప్రమోషన్స్ చేయకుండా వదిలేశారు… రిలీజ్ కి కొన్ని రోజుల ముందే సినిమాను…

సడెన్ డిజిటల్ రిలీజ్ అనౌన్స్ చేసినా కొంచం ప్రమోషన్స్ లాంటిది చేసి ఉంటే జనాల్లో ఈ సినిమా అంటూ ఒకటి రిలీజ్ అవుతుంది అని తెలిసి ఉండేది కానీ అసలు ఎక్కడా కూడా సినిమా గురించిన ప్రమోషన్స్ లాంటివి లేకుండా ఇంత సైలెంట్ గా రిలీజ్ చేస్తూ ఉండటం కొంత శాకింగ్ గానే అనిపిస్తుంది అని చెప్పాలి. ఇదే టీం వాళ్ళు వెంకీ ప్రీవియస్ మూవీ…

నారప్ప విషయంలో మంచి పబ్లిసిటీ చేసి రిలీజ్ చేసి మంచి రిజల్ట్ ను సొంతం చేసుకున్నారు, కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం కంప్లీట్ గా డిఫెరెంట్ గా ఉంది, ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ మనసు గెలుచుకుంటే మౌత్ టాక్ తో మంచి వ్యూవర్ షిప్ ను తెలుగు లో సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here