బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్నా డీసెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న కోలివుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన తల అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన లేటెస్ట్ మూవీ విదాముయర్చి(Vidaamuyarchi) మూవీ రెండో రోజు ఓవరాల్ గా కొంచం డ్రాప్స్ ను ఎక్కువగా సొంతం చేసుకున్నా కూడా తమిళనాడులో ఓవర్సీస్ లో..
మంచి జోరునే చూపించడంతో డీసెంట్ ట్రెండ్ ను చూపించగా మూడో రోజు మాత్రం అనుకున్న దాని కన్నా కూడా మంచి గ్రోత్ ను సొంతం చేసుకుని ఇప్పుడు కష్టం అనుకున్న బిజినెస్ ను అందుకునే ప్రయత్నం చేస్తూ ఉండటం విశేషమని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఇంపాక్ట్ చూపించని సినిమా….
మూడో రోజు ఇక్కడ 21 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా 3 రోజుల్లో 77 లక్షల షేర్ ని అందుకోగా 1.65 కోట్ల గ్రాస్ ను అందుకుంది. 3 కోట్ల టార్గెట్ కి గాను సినిమా ఇంకా 2.23 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండగా… ఇక తమిళనాడులో సినిమా 3వ రోజున ఓవరాల్ గా..
10-11 కోట్ల రేంజ్ లో గ్రాస్ కన్ఫాం అనుకున్నా అంచనాలను మించి పోయిన సినిమా ఓవర్సీస్ లో కూడా మాస్ రచ్చ చేయడంతో టోటల్ గా 3వ రోజున వరల్డ్ వైడ్ గా 28.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 14.1 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా సినిమా 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
VidaaMuyarchi-Pattudala 3 Days Total WW Collections Approx
👉Tamilnadu – 53.20Cr
👉Telugu States – 1.65Cr
👉Karnataka – 7.10Cr
👉Kerala – 2.50Cr
👉ROI – 0.80Cr
👉Overseas – 32.10Cr***approx
Total WW collection – 97.35CR(47.70CR~ Share) Approx
(51% RECOVERY)
మొత్తం మీద 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను సినిమా 3 రోజుల్లో సగం వరకు రికవరీని చేయగా సినిమా మిగిలిన రన్ లో మరో 44.30 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పాలి. ఇక సినిమా 4వ రోజు సండే అడ్వాంటేజ్ తో మరోసారి కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉంది.