Home న్యూస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్-పెళ్లి సందD 3rd డే, మహా సముద్రం 4th డే కలెక్షన్స్ రిపోర్ట్!!

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్-పెళ్లి సందD 3rd డే, మహా సముద్రం 4th డే కలెక్షన్స్ రిపోర్ట్!!

0

దసరా పండగ అడ్వాంటేజ్ ను వాడుకోవాలని రెండు మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఓ చిన్న సినిమా ఈ సారి సీజన్ లో పోటి పడగా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్ర్రం ఒక మీడియం రేంజ్ మూవీ ఎవ్వరూ అంచనా వేయని విధంగా స్లో డౌన్ అవ్వగా ఓ చిన్న సినిమా ఆ మీడియం రేంజ్ మూవీ కన్నా కూడా బెటర్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ దూసుకు పోతుంది.

ఆ సినిమానే పెళ్లి సందD సినిమా… తొలి 2 రోజులు సూపర్ సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మూడో రోజు ఆదివారం అవ్వడంతో మరో సారి జోరు చూపగా రెండో రోజు తో పోల్చితే మూడో రోజు 20% వరకు ఓవరాల్ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా…

Pelli SandaD 2 Days Total Collections!!

మూడో రోజు ఇప్పుడు మరోసారి 80-90 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని అందుకునేలా కనిపిస్తుంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే లెక్క ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. ఇక మహా సముద్రం సినిమా మూడో రోజు తో పోల్చితే 4 వ రోజు 20-25% డ్రాప్స్ కనిపించగా కొన్ని చోట్ల పుంజుకున్నా కానీ…

Maha Samudram 3 Days Total Collections!

మొత్తం మీద 4 వ రోజు సినిమా 60-70 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకునేలా ఉందని చెప్పాలి.. ఇక అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మూడో రోజు కూడా రాంపేజ్ కొనసాగిస్తూ ఉండగా రెండో రోజు తో పోల్చితే 20-25% వరకు డ్రాప్స్ ఓవరాల్ గా కనిపించాయి కానీ తిరిగి ఈవినింగ్ షోలకు పుంజుకున్న సినిమా…

Most Eligible Bachelor 2 Days Total Collections!

మరో సారి 3.7 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ ఉంది, రెండో రోజు లెవల్ లో అంచనాలను మించితే 4.5 కోట్ల రేంజ్ షేర్ ని అందుకునే అవకాశం కూడా ఉంది… మరి అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అఫీషియల్ ఈ కలెక్షన్స్ ని అందుకుంటాయా లేక మించుతాగా లేక తగ్గుతాయో అఫీషియల్ కలెక్షన్స్ వచ్చాక అప్ డేట్ చేస్తాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here