బాక్స్ అఫీస్ దగ్గర మొదటి రోజు మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్న కోలివుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన తల అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన లేటెస్ట్ మూవీ విదాముయర్చి(Vidaamuyarchi) మూవీ తెలుగులో పట్టుదల పేరుతో డబ్ అవ్వగా కలెక్షన్స్ పరంగా మాత్రం మంచి జోరునే చూపించగా తెలుగు లో మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ను ఏమి చూపించలేదు…
రెండు రోజుల్లో తెలుగు లో మాత్రం నిరాశ పరిచే రిజల్ట్ నే సొంతం చేసుకున్న సినిమా తమిళ్ లో అలాగే ఓవర్సీస్ లో మాత్రం మంచి హోల్డ్ నే చూపించింది, ఇక ఇప్పుడు మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా శనివారం అడ్వాంటేజ్ ఉండటంతో అన్ని చోట్లా మంచి జోరునే చూపెడుతూ ఉండగా..
తమిళనాడులో రెండో రోజు మీద ఈ రోజు గ్రోత్ ని చూపిస్తున్న సినిమా ఓవర్సీస్ లో కూడా పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను చూపెడుతుంది, ఇక మిగిలిన చోట్ల డ్రాప్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా మూడో రోజు తమిళనాడులో సినిమా 11-12 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే గ్రాస్ మరికొంత పెరిగే అవకాశం ఉండగా, కర్ణటకలో పర్వాలేదు అనిపిస్తున్న సినిమా టోటల్ గా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో 2-2.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో మరోసారి హాల్ఫ్ మిలియన్ టు మిలియన్ కి దగ్గర అయ్యే రేంజ్ లో.
కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉన్న నేపధ్యంలో సినిమా ఓవరాల్ గా మూడో రోజు వరల్డ్ వైడ్ గా 20-22 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే 22 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక టోటల్ గా 3 రోజుల్లో సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.