Home న్యూస్ అక్షరాలా 3110 కోట్లు ఔట్…..ఇండియాలో 100 తో ఊచకోత!

అక్షరాలా 3110 కోట్లు ఔట్…..ఇండియాలో 100 తో ఊచకోత!

0

ఈ ఇయర్ హాలీవుడ్ నుండి వచ్చిన మూవీస్ లో మంచి బజ్ ను సొంతం చేసుకుని రిలీజ్ అయిన మూవీ గాడ్జిల్లా X కాంగ్2(Godzilla x Kong: The New Empire India Collections) సినిమా మొదటి [పార్ట్ సక్సెస్ వలన పార్ట్ 2 పై అంచనాలు ఓ రేంజ్ లో పెరగగా రెండో పార్ట్ మరీ ఫస్ట్ పార్ట్ రేంజ్ లో రచ్చ చేయక పోయినా కూడా….

ఓవరాల్ గా ఈజీగా ఒకసారి చూసేలా ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతుంది ఈ సినిమా… ఇండియా లో కూడా ఈ సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపి రీసెంట్ గా 82.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంది. ఇండియా గ్రాస్ లెక్క 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది…

గాడ్జిల్లా మూవీస్ లో ఇలా ఫస్ట్ టైం 100 కోట్ల గ్రాస్ ను అందుకున్న సినిమాగా గాడ్జిల్లా X కాంగ్2 సినిమా సంచలనం సృష్టించింది… ఇక సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 375 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకుని రచ్చ లేపగా ఇండియన్ కరెన్సీలో ఓవరాల్ గా సినిమా 3110 వేల కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుంది….

యునానిమస్ రెస్పాన్స్ కనుక వచ్చి ఉంటే సినిమా హాల్ఫ్ మిలియన్ మార్క్ ని అవలీలగా అందుకుని ఉండేది కానీ ఉన్నంతలో వచ్చిన టాక్ తోనే సినిమా ఓవరాల్ గా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇండియాలో కొంచం స్లో అయిన సినిమా వరల్డ్ వైడ్ గా పర్వాలేదు అనిపించేలా దూసుకు పోతుంది. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here