బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో అంజలి(Anjali) కెరీర్ లో ప్రతిష్టాత్మక 50వ సినిమాగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది(Geethanjali Malli Vachindhi 5 Days WW Collections) కూడా ఒకటి… సినిమా రొటీన్ హర్రర్ కామెడీ నేపధ్యంలో తెరకెక్కగా…
సినిమా మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించేలా జోరు చూపించగా మొత్తం మీద మాత్రం యావరేజ్ రేంజ్ కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది… మూడు రోజుల్లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 65 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా…
సినిమా మిగిలిన 2 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర మరో 10 లక్షల షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో వరల్డ్ వైడ్ గా 13 లక్షల షేర్ మార్క్ ని అందుకుంది. మొత్తం మీద 5 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 75 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 1.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది…
ఇక వరల్డ్ వైడ్ గా 1.03 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 2.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2.5 కోట్ల దాకా ఉంటుందని అంచనా… కాగా సినిమా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది…
మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా ఉన్నంతలో సినిమా మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని అందుకోగా ఓవరాల్ గా మాత్రం టార్గెట్ ను అందుకోక పోవచ్చు. కానీ హర్రర్ కామెడీ నేపధ్యంలో ఇప్పటికీ జనాలు ఎంతో కొంత థియేటర్స్ కి వస్తూ ఉండటం విశేషం. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.