Home న్యూస్ 87 ఏళ్ల చరిత్రలో తొలిసారి….ఎన్టీఆర్ మహానాయకుడు 6 డేస్ కలెక్షన్స్

87 ఏళ్ల చరిత్రలో తొలిసారి….ఎన్టీఆర్ మహానాయకుడు 6 డేస్ కలెక్షన్స్

0

     నట సింహం నందమూరి బాలకృష్ణ క్రిష్ జాగర్ల మూడి ల కాంబినేషన్ లో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండో పార్ట్ ఎన్టీఆర్ మహా నాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా ఊహకందని లెవల్ లో షాక్ ఇచ్చి 3 రోజుల్లో కేవలం 3 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమె అందుకుని షాక్ ఇచ్చింది.

కాగా 4 వ రోజు సినిమా 12 లక్షలు, 5 వ రోజు 9 లక్షలు, 6 వ రోజు సినిమా 5 లక్షల రేంజ్ లో షేర్ ని ఓవరాల్ గా అందుకుంది, టోటల్ గా 4 నుండి 6 వ రోజు సినిమా కలెక్షన్స్ టోటల్ గా 50 లక్షల లోపు ఉన్నాయని సమాచారం. దాంతో…

సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 6 రోజులకు గాను 3.5 కోట్ల లోపే కలెక్షన్స్ ని అందుకుందని చెప్పొచ్చు. ఇక్కడ సినిమా ఏకంగా 87 ఏళ్ల తెలుగు సినిమా చరిత్ర లో మరే సినిమా సాధించని అప కీర్తి ని మూటగట్టుకుంది, అదేంటంటే… సినిమా బిజినెస్ లో 10% కూడా రికవరీ అవ్వని…

పెద్ద హీరో సినిమాగా నిలిచింది. మొదటి పార్ట్ నష్టాలే సినిమా బిజినెస్ గా మారగా 50.1 కోట్ల బిజినెస్ కి కేవలం 3.5 కోట్ల లోపు కలెక్షన్స్ తో 6 రోజులు ముగియడం తో సినిమా ఫేట్ ఏంటో ఫైనల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో అందరికీ ఐడియా వచ్చేసింది.

దాంతో స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ భారీ స్టార్ కాస్ట్ తో వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఇలాంటి దయనీయ మైన కలెక్షన్స్ ని అందుకుని తెలుగు సినిమా చరిత్ర లో మరే సినిమా అందుకోలేని విధంగా షాకింగ్ కలెక్షన్స్ తో చరిత్ర కెక్కింది ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here