Home న్యూస్ 606 కోట్ల నుండి 23 కోట్లు…..చరిత్రకెక్కే షాకిది!!

606 కోట్ల నుండి 23 కోట్లు…..చరిత్రకెక్కే షాకిది!!

0

కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) స్పెషల్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ లాల్ సలామ్(Lal Salaam Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యంత దారుణంగా విఫలం అయ్యింది, అది ఏ రేంజ్ లో ఉంటే రజినీకాంత్ కెరీర్ లోనే ఆల్ టైం ఎపిక్ డిసాస్టర్ మూవీస్ లో ముందు నిలిచే రేంజ్ లో డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.

సినిమా లో రజినీకాంత్ స్పెషల్ రోలే అయిన కానీ ఆల్ మోస్ట్ సగం వరకు స్క్రీన్ టైం ఉన్న రోల్ ని జస్ట్ గెస్ట్ రోల్ గా చెప్పలేమని చెప్పొచ్చు, దాంతో రజినీకాంత్ పేరు మీద బిజినెస్ కూడా డీసెంట్ గా సొంతం చేసుకున్న ఈ సినిమా ఏ దశలో కూడా ఆ బిజినెస్ కి ఏమాత్రం న్యాయం చేయలేక పోయింది ఇప్పుడు…

లాస్ట్ ఇయర్ జైలర్(Jailer Movie) తో ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకుని ఆల్ మోస్ట్ 606 కోట్ల రేంజ్ లో వసూళ్ళని అందుకున్న హీరో నుండి వచ్చిన కొత్త సినిమా స్పెషల్ గెస్ట్ రోల్ అయినా కూడా మినిమమ్ జోరు చూపెడుతుంది అనుకున్నా కూడా లాల్ సలామ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర…

మొత్తం మీద 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 23 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే పట్టుమని 40 లక్షల షేర్ ని కూడా సినిమా అందుకోలేక పోయింది. దాంతో రజినీ కెరీర్ లోనే కాదు ఓ భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన ఏ హీరో కెరీర్ లో కూడా సొంతం అవ్వని రేంజ్ డిసాస్టర్ రిజల్ట్ ను లాల్ సలామ్ మూవీ సొంతం చేసుకుని నిరాశ పరిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here