Home న్యూస్ 95 లక్షలతో మొదలయిన సినిమా…..65 కోట్లతో ఊచకోత ఇది!

95 లక్షలతో మొదలయిన సినిమా…..65 కోట్లతో ఊచకోత ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం ఇండియాలో టాలీవుడ్ అండ్ కోలివుడ్ సినిమాలు పెద్దగా జోరు ఏమి చూపించడం లేదు. అదే టైంలో బాలీవుడ్ సినిమాలు మంచి కలెక్షన్స్ ని సాధిస్తూ ఉండగా మరో పక్క మలయాళ ఇండస్ట్రీ వరుస హిట్స్ తో ఫుల్ జోష్ మీద ఇప్పుడు దుమ్ము లేపుతూ రచ్చ చేస్తూ ఉండటం విశేషం…

రీసెంట్ టైంలో వరుస పెట్టి ఒకటి తర్వాత ఒకటి హిట్స్ ను సొంతం చేసుకుంటున్న మలయాళ ఇండస్ట్రీ లో ప్రేమలు(Premalu Movie Collections) అనే చిన్న సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా లాంగ్ రన్ లో అద్బుతాలు సృష్టించడానికి సిద్ధం అవుతుంది.

సినిమా మొదటి రోజు 95 లక్షల రేంజ్ లో ఓపెనింగ్స్ తో మొదలు అయ్యి ఇప్పుడు 60 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి… సినిమా ఇప్పటి వరకు కేరళలో 32.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా టోటల్ గా ఇండియా గ్రాస్ లెక్క….

35.50 కోట్ల దాకా ఉండగా ఓవర్సీస్ లో సినిమా 24 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఇప్పటి వరకు అందుకోగా ఆల్ మోస్ట్ 60 కోట్ల లోపు గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా ఈ వీకెండ్ టోటల్ కలెక్షన్స్ తో 65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. 95 లక్షల రేంజ్ ఓపెనింగ్స్ తో మొదలైన సినిమా రాంపెజ్ ఇప్పుడు 65 కోట్ల రేంజ్ దాకా వెళుతూ ఉండటం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here