ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉందీ అంటే హిట్స్ కొట్టిన వాళ్ళు కూడా తమ కొత్త సినిమా లను లాక్ డౌన్ తర్వాత డేర్ గా రిలీజ్ చేయడానికి ఒప్పుకోవడం లేడని తెలుస్తుంది, ముఖ్యంగా నార్త్ సైడ్ అలాగే టోటల్ హిందీ బెల్ట్ లో ఎక్కువ శాతం రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఎఫెక్ట్ అలాగే కరోనా అస్సలు తగ్గక పోవడం తో ఇప్పట్లో కొత్త సినిమాలు అక్కడ…
రిలీజ్ అవ్వడం కష్టమే అని అంటున్నారు.. ఇక ఈ దెబ్బతో కొన్ని సినిమాలు డైరెక్ట్ గా స్ట్రీమింగ్ యాప్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్నాయి. పెద్ద సినిమాలకు గాలం వేస్తున్న OTT యాప్స్ అందులో కొన్ని సినిమాలు విముఖత చూపడం తో…
రిలీజ్ కి సిద్ధంగా ఉన్న మీడియం రేంజ్ మూవీస్ ని టార్గెట్ చేయగా ఇప్పుడు అఫీషియల్ గా ఒక క్రేజీ హీరో నటించిన సినిమా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, బాలీవుడ్ లో రీసెంట్ టైం లో ఒకటి తర్వాత ఒకటి వరుసగా 7 హిట్లు కొట్టిన యంగ్ హీరో ఆయుష్ మాన్ ఖురానా అలాగే అమితాబ్ ల కాంబో లో వస్తున్న కొత్త సినిమా…
గులాబో సితాబో సినిమా జూన్ 12 న డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ అవ్వబోతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు, రీసెంట్ టైం లో యమ జోరు మీదున్న హీరోల్లో ఆయుష్ మాన్ ఒకరు, శుబ్ మంగల్ సావ్దాన్, బరేలీ కి బర్ఫీ, బదాయి హో, ఆర్టికల్ 15, డ్రీం గర్ల్, అంధా ధూన్ మరియు బాలా సినిమాలు వరుస హిట్స్ అయ్యాయి.
రీసెంట్ గా చేసిన శుభ్ మంగళ్ జ్యాదా సావ్దాన్ ఒక్కటి అంచనాలు అందుకోలేదు… కానీ ఇన్ని హిట్స్ కొట్టిన యంగ్ హీరో మూవీ, బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ బాగుంటే అవలీలగా 100 కోట్లు కొల్లగొట్టే హీరో సినిమా ఇప్పుడు డైరెక్ట్ గా OTT యాప్స్ లో రిలీజ్ అవ్వబోతుంది అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇది ఇలాగే కొనసాగితే మరిన్ని సినిమాలు ఇదే పద్దతి పాటించడం ఖాయమని అంటున్నారు…