Home TRP రేటింగ్ ది ఫ్యామిలీ స్టార్: 90 కోట్ల సినిమా….టెలివిజన్ లో TRP రేటింగ్ ఎంతో తెలుసా!!

ది ఫ్యామిలీ స్టార్: 90 కోట్ల సినిమా….టెలివిజన్ లో TRP రేటింగ్ ఎంతో తెలుసా!!

0
Vijay Deverakonda The Family Star Movie TRP Rating
Vijay Deverakonda The Family Star Movie TRP Rating

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిన పెద్ద సినిమాలు ఎలక్షన్స్ అండ్ IPL ఎఫెక్ట్ వలన రిలీజ్ లు పోస్ట్ పోన్ చేసుకోవడంతో టోటల్ సమ్మర్ లో ఒకే ఒక్క బిగ్ బడ్జెట్ మూవీగా నిలిచిన సినిమా యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన ది ఫ్యామిలీ స్టార్(The Family Star Movie TRP Rating)….

గీత గోవిందం(Geetha govindam) లాంటి బ్లాక్ బస్టర్ కాంబోలో వచ్చిన ఈ సినిమా మీద పర్వాలేదు అనిపించే రేంజ్ లో అంచనాలు ఉండగా బడ్జెట్ పరంగా కూడా ఆల్ మోస్ట్ 90 కోట్ల రేంజ్ దాకా బడ్జెట్ తో తెరకెక్కగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ను కూడా చూపించ లేక పోయిన సినిమా….

44 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో కేవలం 17.10 కోట్లు మాత్రమే రికవరీ చేసి టోటల్ రన్ లో ఏకంగా 26.90 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని డబుల్ డిసాస్టర్ గా నిలిచింది. తర్వాత డిజిటల్ లో కూడా తీవ్రంగా నిరాశ పరిచిన ఈ సినిమా రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయింది…

సినిమాను భారీ రేటు పెట్టి కొన్న స్టార్ మా ఛానెల్ వాళ్ళు బాగానే ప్రమోట్ చేసి రీసెంట్ గా టెలికాస్ట్ చేశారు….టెలివిజన్ లో కూడా బాక్స్ ఆఫీస్ రేంజ్ లో మరీ భారీగా నిరాశ పరచలేదు కానీ ఛానెల్ వాళ్ళు కొన్న రేటు ప్రకారం మాత్రం జస్ట్ ఓకే అనిపించే రేంజ్ లోనే రేటింగ్ సొంతం అయ్యింది.

ఓవరాల్ గా మొదటి సారి టెలికాస్ట్ లో ది ఫ్యామిలీ స్టార్ మూవీ కి 6.11 టి.ఆర్.పి రేటింగ్ సొంతం అయ్యింది… రీసెంట్ టైంలో కొన్ని పెద్ద సినిమాలకు కూడా ఇదే రేంజ్ లో రేటింగ్ వచ్చింది. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచినా టెలివిజన్ లో ఓకే అనిపించుకున్న ఈ సినిమా లాంగ్ రన్ లో టెలివిజన్ లో ఎంతవరకు పెట్టిన రేటుకి న్యాయం చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here