ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టి లో పెట్టుకుని సినిమాలు చాలా వరకు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కే సిద్ద పడుతుండగా మిగిలిన ఇండస్ట్రీలలో పెద్ద సినిమాలే రేసులో నిలుస్తుంటే తెలుగు లో మాత్రం చాలా చిన్న సినిమాలు మాత్రమే డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని దక్కించుకున్నాయి. ఉన్నంతలో తెలుగు లో కొంచం నోటబుల్ మూవీ అయిన “ఉమామహేశ్వర ఉగ్రరూపస్య” సినిమా ఇప్పుడు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకుని రిలీజ్ అయ్యింది.
యంగ్ హీరో సత్యదేవ్ ముఖ్య పాత్రలో మలయాళంలో ఫహాద్ ఫాసిల్ హీరోగా తెరకెక్కిన మహేశింటే ప్రతీకారం సినిమా ను తెలుగు లో కంచెరపాలెం లాంటి సెన్సేషనల్ మూవీ డైరెక్ట్ చేసిన వెంకటేష్ మహా డైరెక్షన్ లో బాహుబలి నిర్మాతలు అయినా ఆర్కా మీడియా వారు నిర్మించారు. మరి సినిమా ఎలా ఉందొ తెలుసుకుందాం పదండీ..
కథ విషయానికి వస్తే….. అరకు మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క ఫోటో స్టూడియో ఓనర్ కొడుకు అయిన హీరో కూడా ఫోటో గ్రాఫర్… మంచి తనానికి మారు పేరు అయిన హీరో ఊర్లో జరిగే అన్ని ఫంక్షన్స్ తన కెమరాతో ప్రత్యక్షం అవుతూ ఉంటాడు.
ఎంతో మంచి వాడు అయిన హీరో కి అనుకోకుండా ఒక సందర్భం లో జరిగిన పరిస్థితుల వలన ఒకరు తనని కొట్టడంతో తీవ్ర కోపం వస్తుంది… తనని కొట్టిన వాడిని తిరిగి కొట్టే దానా చెప్పులు వేసుకోను అంటూ శపధం చేసిన హీరో తన కోపాన్ని తీర్చుకున్నాడా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సత్యదేవ్ సహజ నటన ఓ రేంజ్ లో మెప్పిస్తుంది. సినిమాలో తన పాత్ర కి తనని తప్ప మరెవరినీ ఊహించలేని రేంజ్ లో నటనతో మెప్పించాడు. ఒరిజినల్ వర్షన్ చూడని వాళ్ళకి తన పాత్ర మరింత బాగా ఆకట్టుకోవడం ఖాయమని చెప్పొచ్చు.
ఇక హరిచందన నటన కూడా నాచురల్ గా ఉండగా తన కళ్ళతోనే నటించి మెప్పించింది. సత్య దేవ్ తండ్రి గా నటించిన మలయాళ సీనియర్ యాక్టర్ నటన కూడా అద్బుతంగా ఉండగా మిగిలిన నటీనటులు కూడా ఉన్నంతలో బాగా నటించి సినిమా కి చాలా వరకు ప్లస్ అయ్యారు.
ఇక సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి బాగా ప్లస్ అయ్యాయి, సాంగ్స్ చాలా నాచురల్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమా ఫీల్ కి తగ్గట్లు బాగా మెప్పిస్తుంది, హీరో కి కోపం వచ్చే టైం లో బ్యాగ్రౌండ్ స్కోర్ మంచి ఎలివేషన్ అయ్యిందని చెప్పాలి. ఇక సినిమాటోగ్రఫీ అయితే అద్బుతం అని చెప్పాలి.
తెలుగు రాష్ట్రాలలోనే సినిమా షూటింగ్ మొత్తం జరగగా మనకు కూడా ఇంత ప్రకృతి అందాలు ఉన్నాయా అన్నంత బాగా చూపెట్టారు. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే సినిమాకి తగ్గట్లు ఉన్నా అక్కడక్కడా స్లో నరేషన్ తో కూడుకుని ఉండటం కొంచం బోర్ అయ్యేలా చేస్తుంది.
ఇక డైరెక్షన్ పరంగా వెంకటేష్ మహా తొలి సినిమా తోనే తన మార్క్ ని చూపెట్టి ఎంతలా మెప్పించాడో సెకెండ్ మూవీ రీమేక్ అయినా కానీ ఎక్కడా ఒరిజినల్ ని చెడగొట్టకుండా తెలుగు నేటివిటికి తగ్గ మార్పులతో మెప్పించి మంచి మార్కులు దక్కించుకున్నాడు. సినిమా థీం ప్రకారం చూస్తె అక్కడక్కడా స్లో అయినా కూడా సినిమా మెప్పిస్తుంది.
ఇక విశ్లేషణ విషయానికి వస్తే సింపుల్ స్టొరీ లైన్ ని తీసుకుని అద్బుతమైన స్టార్ కాస్ట్ ని సెట్ చేసుకుని సినిమాను చాలా బాగా తెరకెక్కించాడు. అక్కడక్కడా కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా మెప్పించాగా ఓవరాల్ గా సినిమా మంచి ఫీల్ గుడ్ మూవీ అని చెప్పాలి. ఒరిజినల్ చూసిన వాళ్ళని కూడా సినిమా చాలా వరకు మెప్పిస్తుంది.
అందరి మంచి పెర్ఫార్మెన్స్ కోసం ముఖ్యంగా సత్యదేవ్ నటన కోసం ఈజీగా సినిమాను చూడొచ్చు, అలాగే మంచి ఫీల్ గుడ్ మూవీ ని చూడాలి అనుకున్న వాళ్లకి ఈ సినిమా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకునే వారికి సినిమా యావరేజ్ రేంజ్ లో ఉంటుంది. సినిమా కి మా ఫైనల్ రేటింగ్… 3 స్టార్స్… హిట్టు సినిమా!!