బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లాను హీరో గా పరిచయం చేస్తూ తెరకెక్కిన మొదటి సినిమా హీరో సంక్రాంతి కి ఆడియన్స్ ముందుకు వచ్చింది. పాన్ ఇండియా మూవీస్ సంక్రాంతి రేసు నుండి తప్పుకోవడం తో సడెన్ గా హీరో మూవీ రేసు లోకి ఎంటర్ అవ్వగా సినిమా కి చాలా లిమిటెడ్ రిలీజ్ సొంతం అయ్యింది అని చెప్పాలి… తర్వాత పెద్దగా ప్రమోషన్స్ కూడా…
లేక పోవడం లాంటివి లాంగ్ రన్ లేకుండా చేసింది. మిగిలిన సంక్రాంతి మూవీస్ తో పోల్చితే త్వరగానే పరుగును పూర్తీ చేసుకుంది హీరో మూవీ… సినిమా ను మొత్తం మీద 23 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కించగా బిజినెస్ సంక్రాంతి సీజన్ లో ఉన్నప్పటికీ…
చాలా లిమిటెడ్ గా జరిగింది… సినిమా ను చాలా సెంటర్స్ లో ఓన్ రిలీజ్ చేయగా ఓవరాల్ గా సినిమా బిజినెస్ ఓన్ రిలీజ్ వాల్యూ మొత్తం మీద 5.5 కోట్ల రేంజ్ లో జరగగా మొత్తం మీద 6 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన హీరో మూవీ టోటల్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర….
సాధించిన కలెక్షన్స్ ని ఏరియాల వారిగా గమనిస్తే….
👉Nizam: 81L
👉Ceeded: 40L
👉UA: 44L
👉East: 20L
👉West: 14L
👉Guntur: 17L
👉Krishna: 15L
👉Nellore: 11L
AP-TG Total:- 2.42CR(4.50CR~ Gross)
👉Ka+ROI: 0.11Cr
👉OS – 0.13Cr
Total WW: 2.66CR(5.10CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్…
6 కోట్ల టార్గెట్ లో సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి 2.66 కోట్లు కలెక్ట్ చేసిన హీరో మూవీ…. మొత్తం మీద 3.34 కోట్ల లాస్ ను సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద డిసాస్టర్ గా నిలిచింది… సంక్రాంతి సీజన్ కాకుండా సోలోగా రిలీజ్ అయినా కానీ కొంచం బెటర్ రిలీజ్ అండ్ కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుని ఉండేది అని చెప్పొచ్చు.