Home న్యూస్ ఫ్లాఫ్ పడ్డా…భారీ బడ్జెట్ పెట్టినా నిర్మాతకి లాభం తెప్పించిన సాయిధరంతేజ్!

ఫ్లాఫ్ పడ్డా…భారీ బడ్జెట్ పెట్టినా నిర్మాతకి లాభం తెప్పించిన సాయిధరంతేజ్!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస హిట్స్ తర్వాత లాస్ట్ ఇయర్ రిపబ్లిక్ సినిమాతో భారీ ఫ్లాఫ్ నే సొంతం చేసుకున్న సాయి ధరం తేజ్ ఇప్పుడు సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ విరూపాక్షతో తన లక్ ని పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నాడు. కాగా ఈ సినిమా తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కగా ఫ్లాఫ్ తర్వాత వస్తున్న సినిమా నే…

అయినా కానీ ఈ సినిమాతో నిర్మాతకి టేబుల్ ప్రాఫిట్ తెప్పించాడు సాయి ధరం తేజ్… సినిమా మొత్తం మీద 40 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మాణం అయ్యిందని సమాచారం. పబ్లిసిటీ మరియు ప్రింట్ ఖర్చులు మరో 4 కోట్ల దాకా ఉండే అవకాశం ఉండగా… సినిమాకి మొత్తం మీద…

నాన్ థియేట్రికల్ బిజినెస్ రేంజ్ లో 28 కోట్ల దాకా రికవరీ అయ్యిందట, ఇందులో ఇతర భాషల డబ్బింగ్ రైట్స్ కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఇక సినిమా థియేట్రికల్ బిజినెస్ రేంజ్ 22 కోట్లకు పైగా జరిగింది… దాంతో మొత్తం మీద సినిమా టోటల్ బిజినెస్ వాల్యూ 50 కోట్ల దాకా ఉండగా…

బడ్జెట్ అండ్ ఇతర ఖర్చులు తీసేసినా కూడా నిర్మాతకి 6 కోట్ల రేంజ్ లో టేబుల్ ప్రాఫిట్ సొంతం అవ్వడం విశేషం అని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను మించితే ఈ లాభం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

1 COMMENT

  1. రిపబ్లిక్ flop ఏంటిరా జఫ్ఫా… మంచి సినిమా… నువ్వు ని చెత్త post లు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here