సాయి కుమార్ తనయుడు ఆది కి ఈ మధ్య అస్సలు కలిసి రావడం లేదు, కెరీర్ మొదట్లో రెండు మూడు వరుస విజయాలను సొంతం చేసుకుని ప్రామిసింగ్ యంగ్ హీరోగా మారిన ఆది కెరీర్ తొలినాళ్ళ లోనే 5 కోట్ల నుండి 8 కోట్ల రేంజ్ మార్కెట్ ని సొంతం చేసుకున్నాడు, కానీ తర్వాత సరైన సినిమాలను ఎంచుకోవడం లో విఫలం అయిన ఆది కెరీర్ సడెన్ గా డౌన్ ఫాల్ అవ్వడం మొదలు పెట్టింది.
ఇక రీసెంట్ టైం లో ఆది సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర కనీస కలెక్షన్స్ కూడా రావడం లేదు, బుర్రకథ మరియు లేటెస్ట్ జోడి వరుసగా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల మనసు గెలుచుకోకుండానే వెళ్లి పోయి రెండు డిసాస్టర్ గా నిలిచి పోయాయి. ఆ సినిమా లలో ఇప్పుడు బుర్రకథ సినిమా..
శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా కొనింది, ఫామ్ లో లేకున్నా కానీ ఏకంగా 2 కోట్ల రేంజ్ రేటు చెల్లించి సినిమా శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకోగా సినిమా ను రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ చేశారు. కాగా సినిమా TRP రేటింగ్ పరంగా అయినా పర్వాలేదు అనిపిస్తుంది అనుకుంటే…
కేవలం 3.63 TRP రేటింగ్ ని మాత్రమె సొంతం చేసుకుంది. కాగా మొదటి సారి టెలికాస్ట్ సమయం లో చానెల్ కి చాలా తక్కువ మొత్తం మాత్రమె రికవరీ అయ్యిందట. అదే సమయం లో రిలీజ్ అయిన మరో సినిమా వివేకం కి 3.16 TRP రేటింగ్ దక్కింది.
డబ్బింగ్ మూవీ తో పోల్చుకుంటే కొంచం బెటర్ TRP రేటింగ్ నే సొంతం చేసుకున్నా ఆది సినిమాలకు బుల్లితెర పై కూడా వ్యూవర్స్ తగ్గిపోతున్నారు. ఇక నైనా మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకుని తన మార్కెట్ ని ఇంప్రూవ్ చేసుకుంటాడో లేదో చూడాలి… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.