Home న్యూస్ ఒక సినిమా కోసం ఎక్కువ కాలం కష్టపడ్డ హీరోలు వీరే

ఒక సినిమా కోసం ఎక్కువ కాలం కష్టపడ్డ హీరోలు వీరే

0

   సినిమా మీద ఉన్న ప్రేమ కావొచ్చు….లేక ఆ సినిమా డిమాండ్ చేసి ఉండొచ్చు కానీ ఒక సినిమా కోసం ఏళ్లకు ఏళ్ళు కష్టపడ్డ హీరోలు కొందరు ఉన్నారు ఇండియన్ సినిమా హిస్టరీలో…కొన్ని సినిమాలు ఏళ్లకు ఏళ్ళు పోస్ట్ పోన్ అవుతుంటాయి కానీ ఆ సినిమాల కోసం హీరోలు కొన్ని నెలలే కష్టపడుతూ ఉంటారు. కానీ కొన్ని సినిమాలకు కథ డిమాండ్ చేసి ఉండొచ్చు…లేక హీరోలు ఆ సినిమాల కోసం కష్టపడాలి అని ఫిక్స్ అయ్యి ఉండొచ్చు…ఇలాంటి వాళ్ళు ఇండియన్ హిస్టరీలో ఓ ముగ్గురు హీరోలు ఉన్నారు. వాళ్ళు వీళ్ళే….

3. అమీర్ ఖాన్(మంగల్ పాండే):
అమీర్ ఖాన్ హీరోగా చేస్తున్న ఏ సినిమా కోసం అయినా ఏళ్ళు కష్టపడుతూ ఉంటాడు..కానీ ఈ సినిమా కోసం ఏకంగా 3.2 ఏళ్ళు కష్టపడ్డాడు ఈ హీరో. అదంతా సినిమాలో తన లుక్ కోసం దాంతో పాటుగా సినిమా షూటింగ్ కి అన్నీ తానై నడిపించాడు అమీర్ ఖాన్. దాంతో సినిమా రిలీజ్ ఆలస్యం అయ్యింది..సినిమా రిజల్ట్ కూడా ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు.

2. విక్రమ్ (ఐ మనోహరుడు):
చియాన్ విక్రమ్ సినిమా కోసం ప్రాణం పెట్టే హీరో అని అందరికీ తెలిసిన విషయమే..కానీ ఐ సినిమా కోసం తన కెరీర్ ని ఏకంగా 3.5 ఏళ్ళు త్యాగం చేశాడు విక్రమ్, సినిమాలో పలు గెటప్స్ లో కనిపించడం కోసం తన బాడీని పెంచుతూ తగ్గిస్తూ సినిమా కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. సినిమా కొందరినీ నిరాశపరిచినా విక్రమ్ డెడికేషన్ కి మాత్రం స్టాండింగ్ అవేషణ్ దక్కింది.

1. ప్రభాస్( బాహుబలి సిరీస్ ):
బాహుబలి ఇండియన్ సినిమా హిస్టరీలో ఎక్కువమంది నోళ్ళలో మెదిలిన పేరు…ఈ సినిమా అవడానికి రెండు పార్ట్స్ అయినా ఈ సినిమా కోసం హీరో ప్రభాస్ పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. బాహుబలిగా రాజసాన్ని చూపడానికి..శివుడిగా వీరత్వాన్ని ప్రదర్శించడానికి దాదాపు రెండు పార్ట్స్ ని కలుపుకుంటే దాదాపు 5 ఏళ్ళు ఈ సినిమా కోసమే కేటాయించాడు ప్రభాస్. ఈ సినిమాతో వచ్చే పేరు కూడా అశేషం కాబట్టి ప్రభాస్ కి తిరుగులేని ఇమేజ్ ని తెచ్చిపెట్టింది ఈ సినిమా.

ఈ ముగ్గురు హీరోలు సినిమాల కోసం మినిమమ్ మూడేళ్ళు అంతకంటే ఎక్కువ కేటాయించగా….హృతిక్ రోషన్ జోదాఅక్బర్-మొహెంజోదారో కోసం 2 ఏళ్ళు, అమీర్ ఖాన్ దంగాల్ కోసం రెండేళ్ళు, షారుఖ్ ఖాన్ రా.వన్ కోసం 2 ఏళ్ళు కేటాయించారు. ఇక మన హీరోల్లో ఎక్కువ శాతం సినిమా షూటింగ్ డిలే అవ్వడం వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన సినిమాలే కానీ కేవలం సినిమా కోసమే ఎక్కువకాలం ఆగిన హీరోలు లేరనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here