Home న్యూస్ ది గోట్ లైఫ్ (ఆడుజీవితం) మూవీ రివ్యూ!!

ది గోట్ లైఫ్ (ఆడుజీవితం) మూవీ రివ్యూ!!

0

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) చాలా టైం గా తీసిన సినిమా ది గోట్ లైఫ్ (ఆడుజీవితం)(The Goat Life Movie Review in Telugu)….చాలా డిలే తర్వాత సినిమా రీసెంట్ గా మలయాళంతో పాటు డబ్ వర్షన్ లు కూడా రిలీజ్ అయ్యాయి. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ కి వస్తే తన భార్య మరియు తల్లితో కలిసి జీవించే హీరో తన కుటుంబానికి ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది అనుకుని ఒక ఏజంట్ ద్వారా సౌదీ అరేబియాలో పని చేయడానికి వెళతాడు, కానీ అక్కడ దళారీల చేతులలో పడిన హీరో చిత్ర హింసల పాలవుతాడు…. అక్కడ నుండి తప్పించుకోవడానికి హీరో చేసిన ప్రయత్నాలు ఏంటి….

ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…. రెగ్యులర్ కథలను పూర్తి భిన్నంగా సర్వైవల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ది గోట్ లైఫ్ (ఆడుజీవితం) రెగ్యులర్ మూవీస్ ఇష్టపడే వారికి చాలా బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది, హీరో పడుతున్న కష్టాలు చూసి ఇంకెప్పుడు హీరో బయటపడతాడో అని ఎదురు చూసి బోర్ ఫీల్ అవుతారు….

కానీ కొత్త కథలు కోరుకునే ఆడియన్స్, ఇలాంటి సర్వైవల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి మాత్రం ది గోట్ లైఫ్ (ఆడుజీవితం) సినిమా బాగా నచ్చుతుంది, లెంత్ కొంచం ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగినా కూడా హీరో జర్నీలో మనం కూడా కలిసిపోతాం…. డిఫెరెంట్ మూవీస్ చేయడానికి ఇష్టపడే హీరో…

పృథ్వీరాజ్ సుకుమారన్ అద్బుతమైన నటనతో మెప్పించాడు. కొన్ని సీన్స్ లో గుర్తు పట్టలేని విధంగా తన లుక్స్ ఉండటం సినిమా కోసం ఎంతలా పృథ్వీరాజ్ సుకుమారన్ కష్టపద్దాడో అన్న దానికి నిదర్శనం. అమలాపాల్ రోల్ పర్వాలేదు అనిపించే విధంగా ఉండగా మిగిలిన రోల్స్ ఉన్నంతలో బాగానే నటించారు….

సంగీతం సినిమా ఫీల్ కి తగ్గట్లు ఉండగా ఎడిటింగ్ బాగుంది కానీ ఇది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రమె ఎక్కువ కనెక్ట్ అవుతుంది…డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ ను ఫుల్ న్యాయం చేశాడు…. మొత్తం మీద ఇది ముందే చెప్పినట్లు రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ చూసే ఆడియన్స్ కి బోర్ ఫీల్ అయ్యేలా చేసే సినిమా…

కానీ ఇలాంటి డిఫెరెంట్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి మాత్రం ఒక డిఫెరెంట్ ఎక్స్ పీరియన్స్ ను ఈ సినిమా ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు…. దాంతో రెగ్యులర్ మూవీస్ చూసి బోర్ ఫీల్ అయ్యే ఆడియన్స్ కూడా కొంచం ఓపిక చేసుకుని చూస్తె పృథ్వీరాజ్ సుకుమారన్ ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్ తో ది గోట్ లైఫ్ (ఆడుజీవితం) మెప్పించే అవకాశం ఎంతైనా ఉంటుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here