బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ రెండేళ్ళ క్రితం ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన అక్కినేని అఖిల్(Akkineni Akhil) నటించిన ఏజెంట్(Agent Movie) మూవీ మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది క్రేజీ ప్రాజెక్ట్ గా రూపొందింది…ఆల్ మోస్ట్ 80 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా…
మొదటి ఆటకే డిసాస్టర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా తర్వాత ఏ దశలో కూడా తేరుకోలేక ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది. దాంతో సినిమా ఓటిటి రిలీజ్ ఆలస్యం అవ్వగా ఆల్ మోస్ట్ 685 రోజుల వెయిటింగ్ తర్వాత సినిమా డిజిటల్ రిలీజ్ ఎట్టకేలకు…
రీసెంట్ గా సోని లివ్ యాప్ లో జరిగింది. ఆల్ మోస్ట్ అందరూ సినిమాను మర్చిపోయే పరిస్థితిలో డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకున్న ఏజెంట్ కి ఇప్పుడు ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుంది అన్నది ఆసక్తి గా మారగా…
రిలీజ్ టైం తో పోల్చితే ఇప్పుడు కూడా ట్రోల్స్ సినిమా మీద గట్టిగానే పడుతున్నాయి అని చెప్పాలి. చిన్నప్పటికీ స్పై-రా ఏజెంట్ అవ్వాలని అనుకునే హీరో ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్నది సాధించలేక పోతున్న టైంలో ఏకంగా రా సీనియర్ ఆఫీసర్ అయిన మమ్ముట్టినే తన దగ్గరికి రప్పించుకుని…
తనకి స్పై ఛాన్స్ ఇవ్వాలని కోరినా నువ్వు ఆ జాబ్ కి సెట్ అవ్వవు అని చెప్పినా ఓ బిగ్ రాకెట్ ను సాల్వ్ చేయడానికి హీరోనే నియమిస్తారు….ఆ తర్వాత ఏం జరిగింది అన్నది అసలు కథ అయితే సురేందర్ రెడ్డి ఆ కథని డీల్ చేసిన విధానం చాలా నీరసంగా ఉండటంతో…
ప్రతీ క్యారెక్టర్ మరీ ఓవర్ ది టాప్ అనిపించేలా లౌడ్ గా మాట్లాడటం లాంటివి అప్పుడూ ఎవ్వరికీ నచ్చలేదు…ఇప్పుడు కూడా అది నచ్చలేదు…కానీ కొన్ని పార్టు పార్టులు పర్వాలేదు అనిపించేలా ఉన్నాయని చెబుతున్నా కూడా ఓవరాల్ గా సినిమా కి ఇప్పుడు డిజిటల్ లో కూడా…
రిలీజ్ అయిన తర్వాత ట్రోల్స్ హెవీ గానే పడుతున్నాయి అని చెప్పాలి..80 కోట్ల బడ్జెట్ తో భారీ లెవల్ లో రూపొందిన ఏజెంట్ మినిమమ్ అంచనాలను అందుకోలేక పోయింది. ఇప్పుడు ఓటిటి కూడా ఆడియన్స్ నుండి ట్రోల్స్ ను సొంతం చేసుకుని అప్పుడు మిస్ అవుతుంది అనుకున్న కోటాని ఇప్పుడు పూర్తి చేసుకుంది అని చెప్పాలి.