బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ మొదలు పెట్టిన 6 ఏళ్ళకి మొదటి హిట్ ని సొంతం చేసుకున్న అఖిల్ అక్కినేని, లాస్ట్ ఇయర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో క్లీన్ హిట్ ని దక్కించుకున్న తర్వాత ఇప్పుడు తన కెరీర్ లో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ని సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఏజెంట్ పేరుతో చేస్తూ ఉండగా సినిమాలో కీలక రోల్ లో మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తూ ఉండటం విశేషం…
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాదే ఆడియన్స్ ముందుకు వస్తుంది అనుకున్నా కానీ రీసెంట్ గా సినిమా మేకర్స్ ఈ సినిమా కి వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాం అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు…
ఆది పురుష్, వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి, వారసుడు ఇలా చాలా సినిమాలు సంక్రాంతి రేసులో నిలవగా వాటితో ఏజెంట్ కూడా ఒకటిగా నిలిచింది, ఆదిపురుష్ గ్రాఫిక్స్ ట్రోల్స్ కారణంగా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకోగా మిగిలిన సినిమాలు సంక్రాంతి రేసులో అలానే ఉన్నాయి.
కానీ ఇప్పుడు సడెన్ గా ఏజెంట్ కూడా సంక్రాంతి రేసు నుండి తప్పుకుని సోలో రిలీజ్ కోసం పోస్ట్ పోన్ అయిందని సమాచారం. శివరాత్రి కి సినిమా సోలో గా ఆడియన్స్ ముందుకు రాబోతుందని అంటున్నారు. దాంతో సంక్రాంతి మేజర్ పోటి ఇప్పుడు 2 సీనియర్ హీరోల మధ్య ఒక డబ్బింగ్ సినిమా కి పోటి ఉండబోతుంది, ఏజెంట్ సోలో గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.