బాక్స్ ఆఫీస్ దగ్గర రెండేళ్ళ క్రితం భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన అఖిల్ అక్కినేని(Akhil Akkineni) నటించిన ఏజెంట్(Agent Movie) ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయిన విషయం తెలిసిందే. కచ్చితంగా మీడియం రేంజ్ మూవీస్ లో సంచలనం సృష్టిస్తుంది అనుకున్న ఆ సినిమా…
అంచనాలను అందుకోలేక మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిసాస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఆ సినిమా ఇంపాక్ట్ తో కొత్త సినిమా మొదలు పెట్టడానికి చాలా టైం తీసుకున్న అఖిల్ ఏకంగా 2 ఏళ్ల టైం తర్వాత ఇప్పుడు తన కొత్త సినిమాను మొదలు పెట్టాడు…
తన కొత్త సినిమా అఫీషియల్ టైటిల్ ను లెనిన్(Lenin Movie) గా కన్ఫాం చేస్తూ ఒక గ్లిమ్స్ ను రిలీజ్ చేయగా, రెండేళ్ళ తర్వాత అఖిల్ నుండి వస్తున్న ఈ సినిమా గ్లిమ్స్ తోనే అంచనాలను సాలిడ్ గా పెంచేసింది అని చెప్పాలి. కంప్లీట్ మాస్ రగ్గుడ్ లుక్ లో అఖిల్ అక్కినేని…
ఓ రేంజ్ లో కుమ్మేయగా గ్లిమ్స్ షాట్స్ చాలా రిచ్ గా మెప్పించగా తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ గ్లిమ్స్ ను మరో లెవల్ కి వెళ్ళేలా చేసింది అని చెప్పాలి. దాంతో సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి…. ఇక గ్లిమ్స్ లో అఖిల్ మాస్ లుక్స్ తో పాటు…
పుట్టేటపుడు ఊపిరి ఉంటాది.. పేరు ఉండదు….పోయేటపుడు పేరు మాత్రమే ఉంటాది….ఊపిరి ఉండదు చెప్పిన డైలాగ్ కూడా హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి. ఇక సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా శరవేగంగా షూటింగ్ జరుపుకోబోతున్న ఈ సినిమా….
ఎప్పుడు వచ్చినా కూడా అఖిల్ కి మొదటి సినిమా నుండి ఊరిస్తున్న ఊరమాస్ హిట్ ఈ సినిమాగా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మధ్యలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ తో డీసెంట్ హిట్ కొట్టినా ఎప్పటి నుండో ఊరిస్తున్న ఊరమాస్ హిట్ ఈ సినిమా అందుకునే అవకాశం ఎంతైనా ఉంది.