ఈ నార్త్ ఆడియన్స్ సౌత్ నుండి వెళ్ళిన డబ్బింగ్ మూవీస్ అంటే చాలు చెవి కోసుకుంటూ చూస్తారేమో… ఇక్కడ హిట్ లేదా ఫ్లాఫ్ అన్న తేడా లేకుండా అన్ని సినిమాలకు కూడా అక్కడ సెన్సేషనల్ వ్యూస్ అండ్ లైక్స్ దక్కుతూనే ఉన్నాయి. రీసెంట్ టైం లో కరోనా ఎఫెక్ట్ వలన అందరూ ఇళ్ళలోనే ఉండటం తో మరింతగా సినిమాలకు అక్కడ సాలిడ్ రెస్పాన్స్ పెరుగుతూ పోతూనే ఉంది.
లేటెస్ట్ గా అక్కినేని అఖిల్ మరియు నిది అగర్వాల్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన మిస్టర్ మజ్ను సినిమా అక్కడ డబ్ అయ్యి ముందు యూట్యూబ్ లో తర్వాత టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వగా రెండు చోట్లా కూడా అద్బుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.
టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు ఆ వీక్ కి టాప్ రేటింగ్స్ ని అందుకున్న సినిమాగా నిలిచి దుమ్ము లేపిన ఈ సినిమా, యూట్యూబ్ లో రిలీజ్ అయినప్పటి నుండి సెన్సేషనల్ వ్యూస్ తో దూసుకు పోతూ ఇప్పుడు 100 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకున్న సినిమా గా నిలిచి దుమ్ము దుమారం చేసింది.
లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక్కడ రిలీజ్ అయ్యి పర్వాలేదు అన్న రెస్పాన్స్ తెచ్చుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడ లేకపోయిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకుని షాక్ ఇవ్వగా ఇప్పుడు హిందీ లో డబ్ అయ్యి అక్కడ మాత్రం బ్లాక్ బస్టర్ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం.
ఓవరాల్ గా 100 మిలియన్ మార్క్ ని అందుకున్న సినిమా ఏకంగా 1.3 మిలియన్స్ కి పైగా లైక్స్ ని సొంతం చేసుకుని రచ్చ చేసింది. ఇక లాంగ్ రన్ లో మరిన్ని రికార్డు వ్యూస్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక అఖిల్ నటిస్తున్న కొత్త సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వచ్చే సంక్రాంతి కి ఆడియన్స్ ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే…