ఈ ఇయర్ బాలీవుడ్ లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సినిమాలలో బడే మియా చోటే మియా(Bade Miyan Chote Miyan) సినిమా కూడా ఒకటి…అక్షయ్ కుమార్(Akshay Kumar) టైగర్ ష్రాఫ్(Tiger Shroff) కాంబోలో వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో ఒకటి అని చెప్పాలి.
ఆల్ మోస్ట్ 350 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రంజాన్ కానుకగా రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాఫ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్న వాళ్ళకి సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పాలి ఇప్పుడు…సినిమా ను ఇండియాలో మేజర్ చెయిన్ లో పెర్సేంటేజ్ బేస్ తో రిలీజ్ చేశారు…
కానీ చాలా మాస్ సెంటర్స్ లో సినిమాను అడ్వాన్స్ తీసుకుని రిలీజ్ చేసినట్లు సమాచారం. అన్ని చోట్లా సినిమాను కొన్న వాళ్ళకి ఆల్ మోస్ట్ 80% రేంజ్ లో లాస్ లు కన్ఫాం గా సొంతం కాబోతుందని సమాచారం. దాంతో మేకర్స్ ని వాళ్ళు అప్రోచ్ అయ్యి సినిమా నష్టాలను ఎంతో కొంత పూడ్చాలని అంటున్నారు.
రంజాన్ లాంటి భారీ సీజన్ లో కూడా ఇండియాలో ఈ సినిమా 60 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా వర్త్ షేర్ 30 కోట్ల లోపు మాత్రమే ఉండటం సినిమా ఏ రేంజ్ లో నిరాశ పరిచిందో అన్నదానికి నిదర్శనం. ఇక మేకర్స్ కూడా యాక్టర్స్ నుండి ఎంతో కొంత రిఫండ్ ను ఎక్స్ పెర్ట్ చేస్తున్నారట. వాటి లెక్కలు తేలాల్సి ఉంది.