Home న్యూస్ తప్పంతా నాని మీద రుద్దుతున్న ఇండస్ట్రీ…అసలు నిజాలు ఏంటి!

తప్పంతా నాని మీద రుద్దుతున్న ఇండస్ట్రీ…అసలు నిజాలు ఏంటి!

0

నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ టక్ జగదీష్ ను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనీ ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఆంధ్రలో టికెట్ రేట్ల పరిస్థితి ఏమాత్రం మెరుగు కాక పోవడం, రిస్క్ చేసి రిలీజ్ చేసినా కలెక్షన్స్ ఎలా వస్తాయో అన్న డౌట్ ఉండటంతో కొత్త ప్రొడక్షన్ హౌస్ అయిన షైన్ స్క్రీన్స్ వాళ్ళు సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారు. నాని కూడా తన వంతుగా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా…

ఇక ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వలన నిర్మాతలు OTT కే ఓటు వేయడంతో తప్పక ఇక నిర్ణయం నిర్మాతలదే అని చెప్పేశాడు.. ఇక సినిమా సెప్టెంబర్ 10 న డిజిటల్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుండగా రీసెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు ప్రెస్ మీట్ పెట్టి…

లవ్ స్టోరీ థియేటర్స్ లో వస్తుంటే అదే రోజు టక్ జగదీష్ ని OTT లో ఎలా రిలీజ్ చేస్తారని, రిలీజ్ డేట్ ను మార్చుకోవలంటూ చెప్పగా, నాని ఒక సినిమా ఈవెంట్ లో థియేటర్స్ లోనే సినిమాలు రావాలని చెప్పి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటని వాదించారు. కొత్త సినిమాలు అన్నీ కూడా అక్టోబర్ ఎండ్ దాకా OTT లో రిలీజ్ చేయొద్దు అని చెప్పినా…

ఇప్పుడు టక్ జగదీష్ ని రిలీజ్ చేస్తున్నారని వాదించగా… ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత రిలీజ్ అయిన పెద్ద సినిమా నారప్ప ని అసలు ఎవరూ గుర్తు చేయలేదు… ఆ సినిమా డిజిటల్ రిలీజ్ తర్వాత ఇతర సినిమాల అగ్రిమెంట్స్ జరగడం మొదలు అయింది. ఆంధ్రలో పరిస్థితులపై అందరి కన్నా ముందు స్పందించి చెప్పింది నానినే…. టికెట్ రేట్ల పరిస్థితి అసలు బాలేదని ఓపెన్ గా చెప్పినా…

ఇండస్ట్రీ నుండి ఎలాంటి సహకారం రాలేదు. ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తూ కామెంట్ కూడా చేయలేదు.. కానీ ఇప్పుడు తన సినిమా విషయంలో ఇలాంటి కామెంట్స్ చేయడం విచిత్రంగా ఉందని చెప్పాలి… ఇదే టైం లో నాని అప్ కమింగ్ మూవీస్ ని కూడా ఆడనివ్వం అంటూ కూడా ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేశారు… కానీ ఎండ్ ఆఫ్ ది డే ఎవరి సినిమా నిర్ణయం వాళ్ళదే… వేరే సినిమాలు వస్తున్నాయని ఇంకో సినిమా రిలీజ్ ను ఆపమనడం ఎంత వరకు కరెక్ట్…

ఒక డేట్ కి థియేటర్స్ లో పోటి లో రెండు కి మించిన సినిమాలు రిలీజ్ అయిన సందర్బాలు అనేకం ఉన్నాయి… పోటి పడకుండా సోలో గా రిలీజ్ చేసుకోండి అంటూ ఏ ఇండస్ట్రీ పెద్దలు ఎప్పుడూ చెప్పలేదు… అలాగే ప్రస్తుతం ఆంధ్రలో ఉన్న పరిస్థితులు సెట్ చేయడానికి ఇప్పటికి కూడా సరైన ప్రయత్నాలు చేయలేదు ఇండస్ట్రీ వాళ్ళు… వాళ్ళు ప్రయత్నాలు చేసి…

పరిస్థితులు నార్మల్ అయ్యి టికెట్ రేట్లు నార్మల్ అయితే అప్పటికి కూడా డిజిటల్ లో రిలీజ్ లు చేసుకుంటే విమర్శలు చేసినా ఒక అర్ధం ఉంటుంది… అలా కాకుండా ఒకరిని టార్గెట్ చేస్తూ పెట్టినట్లు అనిపిస్తున్న ఈ మీటింగ్ ద్వారా నానికి ఇంకా ఫ్యాన్స్ నుండి ఎక్కువ సపోర్ట్ దక్కడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here