బాక్స్ ఆఫీస్ దగ్గర లేటెస్ట్ గా రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా భీమ్లా ఓవరాల్ గా మొదటి వారాన్ని మంచి వసూళ్ళతో పూర్తీ చేసుకుంది, సినిమా మీద ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉండగా ఆ అంచనాలను అందుకునే రేంజ్ లోనే ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమా కి ఆంధ్రలో లో టికెట్ రేట్స్ ఇబ్బంది పెట్టగా వాటిని తట్టుకున్న సినిమా ఓవరాల్ గా మధ్యలో…
శివరాత్రి హాలిడే అడ్వాంటేజ్ వలన ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది… కానీ 7 వ రోజు అంచనాలను అందుకోలేక భారీగా స్లో అయిన సినిమా తీవ్రంగా నిరాశ పరిచినా కానీ మొత్తం మీద మొదటి వారం లెక్కల ప్రకారం టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది…
హైయెస్ట్ కలెక్షన్స్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకున్న సినిమాల జాబితాలో ఒకటిగా చేరి సంచలనం సృష్టించింది, లాస్ట్ ఇయర్ వకీల్ సాబ్ ఈ ఇయర్ భీమ్లా నాయక్ లు లో టికెట్ రేట్స్ ఆంధ్రలో ఉన్నా కానీ లిస్టులో చోటు సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి… ఒకసారి టాప్ 10 మూవీస్ ని గమనిస్తే…
👉#Baahubali2- 117.92Cr
👉#AlaVaikunthapurramuloo- 88.25Cr
👉#SarileruNeekevvaru– 84.82Cr
👉#Syeraa- 84.49Cr
👉#Saaho– 74.92Cr
👉#VakeelSaab- 72.28Cr
👉#Bheemlanayak- 70.40Cr***
👉#Pushpa- 67.24Cr
👉#Baahubali- 61.40Cr
👉#Maharshi- 59.07Cr
ఇవీ మొత్తం మీద మొదటి వారంలో రెండు తెలుగు రాష్ట్రాలలో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాలు, బాహుబలి 2 ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంటే తర్వాత నాన్ బాహుబలి రికార్డ్ అల వైకుంటపురం సినిమా పేరిట ఉంది.
ఇక భీమ్లా నాయక్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వలన ఓవరాల్ గా టాప్ 7 ప్లేస్ ను సొంతం చేసుకోగా టికెట్ హైక్స్ ఆంధ్రలో ఉండి ఉంటే కచ్చితంగా టాప్ 5 లో ఒకటిగా నిలిచే అవకాశం ఉండేది అని చెప్పాలి. ఇక మార్చ్ లో పాన్ ఇండియా మూవీస్ రాధే శ్యాం ఆర్ ఆర్ ఆర్ లు బరిలోకి దిగుతున్నాయి కాబట్టి బాహుబలి 2 రికార్డ్ ను బ్రేక్ చేస్తాయో లేదో చూడాలి.