యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ లో భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవల్ లో భారీ ఎత్తున రిలీజ్ అయిన లైగర్ సినిమా తొలి ఆటకే డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేక పోయింది. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన నష్టాలను సొంతం చేసుకున్న ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. హిందీ లో కొంచం పర్వాలేదు కానీ…
తెలుగు రాష్ట్రాల్లో భారీ రేట్లు చెల్లించి సినిమా హక్కులను సొంతం చేసుకున్న బయ్యర్స్ కి డిస్ట్రిబ్యూటర్లకి సినిమా తీవ్రంగా నష్టాలను మిగిలించడంతో చేసేదేమీ లేక సినిమా నష్టాలను పూడ్చాలని మేకర్స్ ని అడగడం మొదలు పెట్టగా పూరీ జగన్నాథ్ తో కొన్ని చర్చలు జరిగిన తర్వాత…
ఇప్పుడు సినిమా కి వచ్చిన నష్టాలలో కొంత మొత్తం వెనక్కి ఇవ్వడానికి పూరీ జగన్నాథ్ ఒప్పుకున్నట్లు లేటెస్ట్ గా టాలీవుడ్ లో వినిపిస్తున్న అప్ డేట్ అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన నష్టాలను సొంతం చేసుకున్న లైగర్ సినిమా కి ఓవరాల్ గా ఆంధ్ర రీజన్ లో 6 కోట్ల వరకు మొత్తం మీద..
వెనక్కి ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు చెబుతూ ఉండగా నైజాం ఏరియా కి గాను 4.5 కోట్ల మేరకు వెనక్కి ఇవ్వడానికి అంగీకారం జరిగిందని అంటున్నారు. ఇక సీడెడ్ ఏరియా కి గాను 2.25 కోట్ల మేర వెనక్కి ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు చెబుతున్నారు. అంటే మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో వచ్చిన నష్టాల్లో 12.75 కోట్ల దాకా వెనక్కి ఇవ్వడానికి మేకర్స్ ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇంత మొత్తం వెనక్కి ఇవ్వడం అంటే…
మామూలు విషయం కాదు, ఈ విషయంలో పూరీ జగన్నాథ్ ని మెచ్చుకుని తీరాల్సిందే. కానీ అదే సమయంలో తెలుగు రాష్ట్రాలలో సినిమా బిజినెస్ కి వచ్చిన కలెక్షన్స్ కి, ఇప్పుడు వెనక్కి వెళుతున్న అమౌంట్ ని పక్కకు పెట్టినా ఇంకా భారీ నష్టాలే సినిమా మిగిలించింది, ఇక ఆ మొత్తం బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు బరించకతప్పదు అని చెప్పాలి.