Home న్యూస్ అరవింద సమేత రివ్యూ…..తారక-త్రివిక్రమ విజయం!!

అరవింద సమేత రివ్యూ…..తారక-త్రివిక్రమ విజయం!!

0

2018 సెకెండ్ ఆఫ్ మోస్ట్ అవైటెడ్ మూవీ అరవింద సమేత వీర రాఘవ అత్యంత భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది…గత నాలుగు సినిమాలుగా ఫ్లాఫుల్లేని ఎన్టీఆర్ ఈ సినిమా మరోసారి దుమ్ము లేపుతాడా లేదా…అజ్ఞాతవాసితో దెబ్బతిన్న త్రివిక్రమ్ మళ్ళీ కంబ్యాక్ చేస్తాడా లేదా అన్న ఆసక్తితో రిలీజ్ అయిన అరవింద సమేత అంచనాలను అందుకుందో లేదో తెలుసుకుందాం పదండీ..

కథ: ఫాక్షనిజం ఆగిపోవాలి అని కోరుకునే హీరో తండ్రిని విలన్ జగపతిబాబు చంపేస్తాడు…తర్వాత రాయలసీమ ఫాక్షనిజంపై డాక్యుమెంటరీ తీస్తున్న హీరోయిన్ కి ప్రాణగండం ఉందని తెలిసి హీరో ఆమెని కాపాడే భాద్యతని తీసుకుంటాడు…మరి హీరో అనుకున్నట్లే ఫాక్షనిజాన్ని అరికట్టాదా లేదా తన తండ్రిని చంపిన విలన్ పై పగ తీర్చుకున్నాడా అన్నది అసలు కథ..

నటీనటులు: ఎన్టీఆర్ ఎప్పటి లానే తన విశ్వరూపాన్ని చూపాడు..పోస్టర్స్ లో మూడీగా ఉన్న ఎన్టీఆర్ ని ఎక్కువగా ఎందుకు చూపెట్టారు అనుకున్నారు అందరూ…కానీ సినిమా మొదట్లోనే తన తండ్రిని కోల్పోయిన హీరో ఆ ఫీలింగ్ ని చివరి వరకు మోస్తూ ఉంటాడు…కానీ ఎక్కడా ఇంటెన్సీ మిస్ కాకుండా అద్బుతంగా నటించి మెప్పించాడు ఎన్టీఆర్.

ఇక యాక్షన్ సీన్స్ అయితే మాత్రం ఆది, సింహాద్రి సినిమాలను మరిపించాడు అని చెప్పొచ్చు…ఆ సినిమాల తర్వాత యాక్షన్ సీన్స్ విషయంలో ఎన్టీఆర్ ని ఓ రేంజ్ లో వాడుకున్న క్రెడిట్ త్రివిక్రమ్ కే వెళుతుంది. ఎమోషనల్ సీన్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఎన్టీఆర్..ఓవరాల్ గా ఈ సినిమాలో తన నటన కెరీర్ టాప్ 3 బెస్ట్ రోల్స్ లో ఒకటని చెప్పొచ్చు.

ఇక హీరోయిన్ పూజా హెడ్గే కి సినిమాలో లెంత్ ఉన్న రోల్ దొరికినా పూర్తిగా ఆకట్టుకోలేదు…జస్ట్ పాస్ మార్కులు పడ్డాయి…ఎన్టీఆర్ తర్వాత ది బెస్ట్ మాత్రం జగపతిబాబు అనే చెప్పాలి…లెజెండ్ లో తన రోల్ ని మరిపిస్తూ మళ్ళీ అరవింద సమేతలో విశ్వరూపం చూపాడు జగపతి బాబు…. ఇక నవీన్ చంద్ర, సునీల్, రావ్ రమేశ్ ఇతర పాత్రలు తమ వరకు బాగా నటించి మెప్పించారు.

సంగీతం: తమన్ అందించిన సంగీతంలో అన్ని పాటలకు అద్బుతమైన రెస్పాన్స్ దక్కింది…బ్యాగ్రౌండ్ స్కోర్ కి అయితే థియేటర్స్ షేక్ అయ్యాయి…ఒకవిధంగా చెప్పాలి అంటే సినిమాకి తన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ తో తమన్ ప్రాణం పోశాడు.

ఇతర సాంకేతిక వర్గం: ఎడిటింగ్ బాగుంది…సెకెండ్ ఆఫ్ లో కొంచం ఎడిటింగ్ కి స్కోప్ ఉంది, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి…ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బాగా తెరకెక్కించారు నిర్మాతలు.

విశ్లేషణ:మాటల మాంత్రికుడు అని తనని ఎందుకు అంటారో మరోసారి నిరూపించాడు త్రివిక్రమ్…ఎంచుకున్న కథకి న్యాయం చేస్తూ ప్రతీ సీన్ ని ఎంతో డీటైల్డ్ గా రాసుకుని తెరకెక్కించాడు…హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ ఎలివేట్ అయ్యాయి…సెంటిమెంట్ సీన్స్ పడాల్సిన చోట అవి పడ్డాయి…సీరియస్ కథ అవ్వడంతో కామెడీ కి పెద్దగా స్కోప్ లేదు…అలాగే మరీ సీరియస్ గా ఉండటంతో ఎమోషనల్ సన్నివేశాలు సెకెండ్ ఆఫ్ లో ఎక్కువ అయ్యాయి అనిపిస్తుంది…అది తప్పితే త్రివిక్రమ్ అల్టిమేట్ కంబ్యాక్ చేశాడు అని చెప్పొచ్చు.

ఎన్టీఆర్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకున్నారో మొదటి 25 నిమిషాల్లోనే త్రివిక్రమ్ చూపెట్టాడు…ఇక నటుడిగా ఎన్టీఆర్ కి చాలా వెయిట్ ఉన్న రోల్ ఇచ్చినా ఎన్టీఆర్ ఎక్కడా ఆ రోల్ కి అన్యాయం చేయకుండా చూసుకున్నాడు…విలన్ పాత్ర అద్బుతంగా పండింది…సినిమా మొత్తం ఒక ఎమోషన్ తో కొనసాగుతుంది..

హైలెట్స్: ఎన్టీఆర్ నటన, ఫైట్స్, త్రివిక్రం డైలాగ్స్, జగపతిబాబు విలనిజం

మైనస్ పాయింట్స్: సెకెండ్ ఆఫ్ లో స్లో సీన్స్…ఎమోషనల్ సీన్స్ ఎక్కువ అవ్వడం, ఎంటర్ టైన్ మెంట్ లేకపోవడం…

త్రివిక్రమ్ తను చెప్పాలి అనుకున్న కథని క్లియర్ గా రిలీజ్ కి ముందుగానే చెప్పాడు…అది విన్నవాళ్లు అదే ఫీల్ లో థియేటర్స్ కి వెళితే సినిమాను బాగా ఎంజాయ్ చేయొచ్చు…అలా కాకుండా టీసర్ ట్రైలర్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని వెళితే కొంచం తక్కువగా సాటిస్ ఫై అవుతారు.

T2B Live Rating—3/5 స్టార్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here