Home గాసిప్స్ మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా “హీరో” మూవీ బడ్జెట్ ఇన్ని కోట్లా!

మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా “హీరో” మూవీ బడ్జెట్ ఇన్ని కోట్లా!

0

టాలీవుడ్ లో ప్రతీ ఇయర్ ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి, వాటిలో స్టార్స్ తో పాటు స్టార్ కిడ్స్ నటించిన సినిమాలు కొత్తగా లాంచ్ అయ్యే హీరోల సినిమాలు ఉంటాయి. కొత్త హీరోలు ఇండస్ట్రీ బయట వారు అయితే ఆల్ మోస్ట్ లో బడ్జెట్ మూవీస్ తోనే లాంచ్ అవుతారు కానీ స్టార్ కిడ్స్ లాంచ్ అయ్యే టైం కి వచ్చే సరికి మంచి స్టార్ కాస్ట్ ని సెట్ చేసుకోవడం…

బడ్జెట్ కూడా పెంచడం లాంటివి చేస్తారు కానీ కొందరు మాత్రమే ఆ బడ్జెట్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర రికవరీ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఇయర్ ఇప్పటికే ఉప్పెన సినిమా తో ఓ స్టార్ కిడ్ లాంచ్ అవ్వగా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు…

అశోక్ గల్లా తొలి పరిచయం హీరో సినిమా తో కాబోతుంది. రీసెంట్ గా ఈ సినిమా అఫీషియల్ టైటిల్ ని టీసర్ ను రిలీజ్ చేయగా ఆడియన్స్ నుండి రెస్పాన్స్ బాగానే సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ లో పరిస్థితులు నార్మల్ అయ్యాక…

ఆడియన్స్ ముందుకు రాబోతుందని సమాచారం. ఇక ఈ సినిమా కోసం బడ్జెట్ కూడా భారీగానే కేటాయించారని తెలుస్తుంది. కొత్త హీరో లాంచ్ మూవీ నే అయినా మంచి స్టార్ కాస్ట్ పాపులర్ హీరోయిన్ రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇలా అన్నీ బాగా సెట్ అయ్యేలా చూసుకోవడం తో ఆల్ మోస్ట్ 25 కోట్ల రేంజ్ బడ్జెట్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నారని తెలుస్తుంది.

సినిమా షూటింగ్ ఇంకా కొంచం పెండింగ్ ఉందని అంటున్నారు… పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అండ్ పబ్లిసిటీ ఖర్చులు కూడా కలుపుకుంటే సినిమా ఓవరాల్ బడ్జెట్ 30 కోట్ల రేంజ్ దాకా వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. మరో కొత్త హీరో మీద ఈ రేంజ్ బడ్జెట్ అంటే సినిమాలో సత్తా ఓ రేంజ్ లో ఉండాలి, సినిమాను అదే రేంజ్ లో ప్రమోట్ చేయాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here