Home న్యూస్ 120 కోట్ల డీల్…ఇండియా లో నం 1!!

120 కోట్ల డీల్…ఇండియా లో నం 1!!

758
0

ఒకప్పుడు సినిమాలకు జనాలు థియేటర్స్ లో చూస్తేనే డబ్బులు వచ్చేవి, తర్వాత టెలివిజన్ లో వేసినప్పుడు డబ్బులు వచ్చేవి, తర్వాత మ్యూజిక్ రైట్స్ ఇలా వివిధ మాధ్యమాల ద్వారా డబ్బులు దక్కడం మొదలు అవ్వగా రీసెంట్ టైం లో వీటన్నింటినీ మించుతూ డిజిటల్ రైట్స్ ఒక్కో సినిమా క్రేజ్ ని బట్టి భారీ రేట్లు ఆఫర్ చేస్తూ అందరికీ షాక్ ఇస్తున్నాయి. ఇండియా లో నిన్న మొన్నటి వరకు డిజిటల్ రైట్స్ పరంగా…

ఆల్ టైం హైయెస్ట్ రేటు ని సొంతం చేసుకున్న సినిమా గా రోబో 2.0 సినిమా నిలిచింది, ఈ సినిమా కి అన్ని భాషల్లో కలిపి డిజిటల్ రైట్స్ కింద సుమారు 110 కోట్లకి అటూ ఇటూ గా రేటు దక్కిందని సమాచారం. కాగా రీసెంట్ గా కే.జి.ఎఫ్ 2 కి ఏకంగా…

120 కోట్ల రేంజ్ డీల్ సెట్ అయ్యిందని టాక్ వచ్చింది కానీ యూనిట్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు, ఈ గ్యాప్ లో ఇప్పుడు అఫీషియల్ గా హైయెస్ట్ డిజిటల్ రైట్స్ రేటు ని సింగిల్ లాంగ్వేజ్ తో నే సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ లక్ష్మీ బాంబ్…

ఈ సినిమా కి తాజా గా డిజిటల్ రైట్స్ కింద ఏకంగా 120 కోట్ల రేటు దక్కడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. కానీ ఈ రేటు అంతలా పలకడానికి రీజన్స్ ఏంటని క్లియర్ గా రివీల్ కాకున్నా కానీ సినిమా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉందని….

అందుకే ఇంత రేటు పలికిందని అంటున్నారు, ఇది కూడా నిజం అయ్యి ఉండొచ్చు అని చెప్పాలి. రీసెంట్ అక్షయ్ కుమార్ మూవీస్ అన్నీ 50 నుండి 60 కోట్ల రేంజ్ లోనే డిజిటల్ రైట్స్ అమ్ముడు పోయాయి, ఇప్పుడు ఏకంగా 120 కోట్ల రేంజ్ రేటు అంటే కచ్చితంగా డైరెక్ట్ రిలీజ్ కానుందని టాక్ వస్తుంది, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొన్న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుందా లేక డైరెక్ట్ OTT రిలీజ్ అన్నది త్వరలో తేలనుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here