బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీమేక్ సినిమాలు ఏమాత్రం వర్కౌట్ అవ్వడం లేదు….ఈ విషయం తెలిసినా కూడా బాలీవుడ్ వాళ్ళు సేఫ్ జోన్ లో ఉండటానికి ఇప్పటికీ రీమేక్ లనే తీస్తున్నారు…ఒరిజినల్ వర్షన్ కూడా అప్పుడప్పుడు హిందీ లో డబ్ అయ్యి జనాలు ఆల్ రెడీ చూసి చూసి ఉన్నా కూడా ఏ నమ్మకంతో జనాలు తిరిగి థియేటర్స్ కి…
వస్తారని అనుకుంటున్నారో నిర్మాతలకే తెలియాలి…లేటెస్ట్ గా బాలీవుడ్ బాక్స్ అఫీస్ దగ్గర క్రిస్టమస్ లాంటి బిగ్ హాలిడే వీకెండ్ లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన యంగ్ హీరో వరుణ్ ధవన్(Varun Dhawan) నటించిన బేబీ జాన్(Baby John Movie) మూవీ రిలీజ్ అయింది.
తమిళ్ లో 2014 టైంలో దళపతి విజయ్ నటించిన బ్లాక్ బస్టర్ తెరీ మూవీ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కగా ట్రైలర్ అండ్ సినిమా సీన్ టు సీన్ తెరీని కాపీ పేస్ట్ చేసి తీయగా ఆల్ రెడీ తెరీ హిందీ డబ్ వర్షన్ చూసిన వాళ్ళకి యావరేజ్ గా చూడని వాళ్లకి ఎబో యావరేజ్ గా అనిపించింది…
ఓవరాల్ గా టాక్ అయితే పర్వాలేదు అనిపించేలా ఉండటంతో కలెక్షన్స్ పరంగా కుమ్మేస్తుంది అనుకున్నా కూడా 4వ వారంలో ఉన్న పుష్ప2 కి కూడా పోటి ఇవ్వలేక పోయింది ఈ సినిమా…మొదటి రోజు 11.25 కోట్లు, రెండో రోజు 5.13 కోట్లు, మూడో రోజు 3.25 కోట్లు…
నాలుగో రోజు 4 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ తో 4 రోజుల్లో 23.63 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని డిసాస్టర్ వైపు పరుగును కొనసాగిస్తుంది. ఆల్ మోస్ట్ సినిమా కోసం 125 కోట్ల రేంజ్ లో బడ్జెట్ పెట్టినట్లు బాలీవుడ్ లో టాక్ ఉంది….ఆ రేంజ్ బడ్జెట్ తో సినిమాకి…
ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ ని కంపేర్ చేస్తే మట్టుకు అట్టర్ డిసాస్టర్ వైపు పరుగును కొనసాగిస్తుంది అని చెప్పాలి. ఏ దశలో కూడా ఇక తేరుకునే అవకాశం కూడా ఇప్పుడు కనిపించడం లేదు…దాంతో ఈ సినిమాతో మంచి మాస్ హీరో అవుతాడు అనుకున్న వరుణ్ ధావన్ కి తీవ్రమైన నిరాశనే మిగిలించింది సినిమా…