లాస్ట్ ఇయర్ క్రిస్టమస్ టైంలో బాలీవుడ్ తరుపున బిగ్గెస్ట్ రిలీజ్ ను సొంతం చేసుకున్న సినిమా వరుణ్ ధవన్(Varun Dhawan) నటించిన బేబీ జాన్(Baby John Movie) మూవీ…2014 టైంలో దళపతి విజయ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ తెరీ హిందీ రీమేక్ గా తెరకెక్కిన సినిమా ట్రైలర్ బాగానే బజ్ ను క్రియేట్ చేయగా…
ఓపెనింగ్స్ కూడా 25 కోట్ల రేంజ్ నుండి మొదలు అవుతాయి అంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేసినా కూడా మొదటి రోజు నుండే కలెక్షన్స్ పరంగా అంచనాలను అందుకోలేక పోయిన ఈ సినిమా ఏ దశలో కూడా తిరిగి తేరుకోలేక పోయింది… 11 కోట్లతో ఓపెన్ అయిన సినిమా…
టోటల్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీ లో నెట్ కలెక్షన్స్ పరంగా 36 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మాత్రమే అందుకుని పరుగును కంప్లీట్ చేసుకుంది. ఇండియాలో సినిమా మొత్తం మీద 42.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పరుగును కంప్లీట్ చేయగా…
ఓవర్సీస్ మొత్తం మీద సినిమా 14 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా గ్రాస్ కలెక్షన్స్ పరంగా 56.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని రన్ ని కంప్లీట్ చేసుకుంది….ఓవరాల్ గా సినిమా సుమారు 125 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో….
రూపొందగా….బ్లాక్ బస్టర్ రీమేక్ గా వచ్చిన బేబీ జాన్ మూవీ వరుణ్ ధవన్ కెరీర్ టర్నింగ్ పాయింట్ అవుతుంది అనుకున్నా కూడా వరల్డ్ వైడ్ గా వాల్యూ షేర్ 28 కోట్ల రేంజ్ లోనే ఉండగా ఓవరాల్ గా బడ్జెట్ లో భారీ లెవల్ లో లాస్ ను సొంతం చేసుకుని…
ఆల్ టైం ఎపిక్ డిసాస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. బ్లాక్ బస్టర్ రీమేక్…మంచి బజ్ నడుమ వచ్చి డీసెంట్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది సినిమా….