Home గాసిప్స్ తూచ్ అదంతా అబద్దం…40 కోట్లు కావాల్సిందే!!

తూచ్ అదంతా అబద్దం…40 కోట్లు కావాల్సిందే!!

0

     2019 ఇయర్ మొదట్లో ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అంచనాలను అందుకోలేక పోయిన నట సింహం నందమూరి బాలకృష్ణ ఆ సినిమా తో హెవీ బడ్జెట్ లు హెవీ బిజినెస్ లకు దూరం ఉండాలని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు బాలయ్య కే ఎస్ రవికుమార్ ల కాంబినేషన్ లో జై సింహా తర్వాత తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రూలర్ విషయం లో గట్టిగా ఫాలో అవుతున్నారు యూనిట్ వర్గాలు.

సినిమా బడ్జెట్ ను అదుపులోనే పెట్టి సినిమాను తెరకేక్కించగా సినిమా బిజినెస్ కూడా లిమిట్ లోనే 25 కోట్ల రేంజ్ లో ఉండబోతుందని సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య చేయబోతున్న అప్ కమింగ్ మూవీ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అన్న విషయం తెలిసిందే.

బాలయ్య డౌన్ లో ఉన్న టైం లో సింహా తర్వాత లెజెండ్ తో అల్టిమేట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బోయపాటి ప్రస్తుతం వినయ విదేయ రామ తో ఫామ్ కోల్పోయి ఉన్నాడు. అలాగే బాలయ్య కూడా ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ తో డీలా పడటం తో ఈ సినిమా బడ్జెట్ చాలా లిమిట్ లో ఉంటుందని వార్తలు వచ్చాయి.

బోయపాటి రెమ్యునరేషన్ భారీ గా తగ్గించి సినిమా ను మొత్తం మీద 25 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొంచిడం జరుగుతుందని వార్తలు చక్కర్లు కొట్టగా ఇప్పుడు అవి రూమర్స్ అని అంటున్నారు, అంత తక్కువ లో సినిమా రూపొందించడం కష్టమని క్వాలిటీ ఉండదని మినిమమ్ బడ్జెట్ 40 కోట్లు అయినా కావాలి అని అంటున్నాడని టాక్ నడుస్తుంది.

బాలయ్య తో బోయపాటి హాట్రిక్ మూవీ అవ్వడం తో అంచనాలు భారీ గా ఉంటాయని, నాసిరకం సినిమా ఇస్తే మరింత ఎదురుదెబ్బ కొడుతుంది అని ఇప్పుడు తిరిగి ఈ ప్రాజెక్ట్ ని భారీ ఎత్తునే రూపొందించే అవకాశం ఉందని ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది, అంటే ఇప్పుడు ఈ సినిమా భారీ బడ్జెట్ మూవీ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here