నట సింహం నందమూరి బాలకృష్ణ బాక్ టు బాక్ కెరీర్ బెస్ట్ హిట్స్ తో ఫుల్ జోష్ మీదున్నాడు, కెరీర్ లో ఇలా వరుస విజయాలతో బాక్ టు బాక్ తన కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని అందుకోవడం అఖండ మరియు వీర సింహా రెడ్డి సినిమాలతో సొంతం చేసుకోగా ఈ రెండు సినిమాల తర్వాత బాలయ్య అపజయం తెలియని డైరెక్టర్ అయిన అనిల్ రావిపూడి…
డైరెక్షన్ లో భగవతి కేసరి సినిమా ఆడియన్స్ ముందుకు దసరా కానుకగా రాబోతుండగా ఈ సినిమా పై ఆల్ రెడీ ఎక్స్ లెంట్ బజ్ నెలకొనగా సినిమా కోసం బాలయ్య ఎంతవరకు రెమ్యునరేషన్ ని తీసుకున్నాడు అన్నది ఆసక్తిగా మారగా టాలీవుడ్ లో వినిపిస్తున్న బజ్ ప్రకారం…
బాలయ్య అఖండ సినిమా కి 12 కోట్లు, వీర సింహా రెడ్డికి గాను 14 కోట్ల దాకా రెమ్యునరేషన్ ని తీసుకున్నట్లు టాక్ ఉండగా ఇప్పుడు భగవతి కేసరి మూవీ కి గాను మరో 3 కోట్లు ఎక్కువగా రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నట్లు స్ట్రాంగ్ బజ్ ఉంది. అంటే ఆల్ మోస్ట్ 17 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని…
ఈ సినిమా కోసం బాలయ్య తన కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ ని తీసుకోబోతున్నట్లు చెప్పొచ్చు. ఇక సినిమా టోటల్ బిజినెస్ లో తర్వాత ప్రాఫిట్ షేర్ కూడా ఉండే అవకాశం ఉందని చెప్పాలి. ఆ వివరాలు సినిమా రిలీజ్ టైంకి తెలిసే అవకాశం ఉంది. ఇక సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య హాట్రిక్ ని సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి.