రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో ఊరమాస్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) నాలుగో వీక్ లో మరింత రచ్చ చేస్తూ న్యూ ఇయర్ వీకెండ్ లో వీర విహారం చేస్తూ దూసుకు పోతూ ఉండగా సినిమా ఆల్ రెడీ మమ్మోత్ బిజినెస్ ను దాటేసి…
కొండంత బిజినెస్ మీద లాభాలాను కూడా సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోయగా, ఓవరాల్ గా హైయెస్ట్ ప్రాఫిట్స్ పరంగా ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం సెకెండ్ హైయెస్ట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది….
టాప్ 1 రికార్డ్ ఔట్ ఆఫ్ రీచ్ అయినా కూడా పుష్ప2 మూవీ సాధించిన బిజినెస్ మీద ప్రాఫిట్ మార్జిన్ ఈ రేంజ్ లో ఉండటం కూడా సెన్సేషన్ అనే చెప్పాలి….మొత్తం మీద 27 రోజులు పూర్తి అయ్యే టైంకి 617 కోట్ల బిజినెస్ మీద 187.41 కోట్ల మమ్మోత్ ప్రాఫిట్ ను సినిమా సొంతం చేసుకుంది…
టాలీవుడ్ లో 2015 లో ఆడియన్స్ ముందుకు వచ్చిన బాహుబలి సినిమా టోటల్ రన్ లో 118 కోట్ల బిజినెస్ మీద 186 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఈ రికార్డ్ ను ఇప్పుడు బ్రేక్ చేసిన పుష్ప2 మూవీ 187 కోట్ల ప్రాఫిట్ ను దాటేసి 200 కోట్ల ప్రాఫిట్ వైపు పరుగులు పెడుతున్నా కూడా…
టాప్ ప్లేస్ లో బాహుబలి2 మూవీ 352 కోట్ల బిజినెస్ మీద చరిత్రలో ఏ సినిమా కూడా ఊహించని రేంజ్ లో 508 కోట్ల ప్రాఫిట్ ను అందుకుంది….పుష్ప2 మూవీ కూడా ఇదే రేంజ్ లో బిజినెస్ చేసి ఉంటే బాహుబలి2 కి దగ్గరగా వెళ్ళేది ఏమో కానీ ఓవరాల్ గా ఇండియన్ మూవీస్ లో…
ఏ సినిమా కూడా సాధించని రేంజ్ లో మమ్మోత్ బిజినెస్ ను అందుకున్న పుష్ప2 మూవీ, ఆ బిజినెస్ మీద ఇలాంటి ప్రాఫిట్ ను అందుకోవడం మాత్రం మామూలు విషయం కాదనే చెప్పాలి. కానీ ఫ్యూచర్ లో అయినా బాహుబలి2 మూవీ నమోదు చేసిన ఈ రికార్డ్ ను ఏ సినిమా అయినా అందుకుంటుందో చూడాలి.