Home న్యూస్ డిసాస్టర్స్ కొడుతున్న బాలీవుడ్ ఆశలన్నీ ఇప్పుడు ఈ సినిమా మీదే!!

డిసాస్టర్స్ కొడుతున్న బాలీవుడ్ ఆశలన్నీ ఇప్పుడు ఈ సినిమా మీదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన ఇండస్ట్రీ లు అన్నీ కూడా అద్బుతమైన సినిమాలతో కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం ఒకటి రెండు హిట్స్ పడుతున్నా కానీ పెద్ద స్టార్స్ నటించిన సినిమాలు కానీ అంచనాలు ఉన్న సినిమాలు కానీ ఏవి కూడా అంచనాలను అందుకోవడం లేదు సరికదా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గీత ని కూడా దాటలేక పోతున్నాయి. రీసెంట్ గా దీపావళి మూవీస్ పై…

ఆశలు ఉన్నా కానీ అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి స్టార్స్ నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు బాలీవుడ్ కి తిరిగి ఊపిరి పోసే ఛాన్స్ ఉన్న సినిమాగా ఇప్పుడు వరుణ్ ధవన్….

మరియు కృతి సనన్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ భేడియా సినిమా పై ఆశలు మొదలు అయ్యాయి, ట్రైలర్ ఎక్స్ లెంట్ గా ఉండటంతో సినిమా పై అంచనాలు పెరిగి పోగా సినిమా ఇది వరకు వచ్చిన బ్లాక్ బస్టర్ స్త్రీ సినిమా యూనివర్స్ లో భాగం కాబోతుంది అంటూ చెబుతూ ఉండటం…

సినిమాలో స్త్రీ సినిమాలో నటించిన శ్రద్ధా కపూర్ కూడా కనిపించబోతుండటంతో అంచనాలు పెరిగాయి. ఈ నెల 25న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై బజ్ కూడా బాగుండటంతో కచ్చితంగా సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకునే చాన్స్ ఉందని అంటున్నారు. మరి సినిమా తిరిగి బాలీవుడ్ కి ఎలా ఊపిరి పోస్తుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here