Home న్యూస్ హిట్ టాక్ ఉంది…కానీ మాములుగా దెబ్బ పడలేదుగా!!

హిట్ టాక్ ఉంది…కానీ మాములుగా దెబ్బ పడలేదుగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో ఎందుకో కొన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ ఉంటున్నా కానీ జనాలు ఆ సినిమాలను థియేటర్స్ లో చూడటానికి అనుకున్న రేంజ్ లో అయితే రావడం లేదు, కారణాలు ఏంటి అనేది ఎవ్వరికీ తెలియదు కానీ స్టార్ కాస్ట్ నచ్చకనో, లేక రీమేక్ సినిమా అనో, లేక మరేమైనా కారణమో తెలియదు కానీ కొన్ని సినిమాలు హిట్ టాక్ తో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర….

నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుంటూ ఉండగా ఇప్పుడు వాటి జాబితా లో అల్లు శిరీష్ నటించిన లేటెస్ట్ మూవీ ఊర్వశివో రాక్షసివో కూడా ఒకటిగా చేరడానికి సిద్ధం అవుతూ ఉంది, రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా కి ఆడియన్స్ నుండి…

మంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం అయింది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ మాత్రం ఆ టాక్ కి ఏమాత్రం సింక్ లేకుండా వస్తున్నాయి. పోటి కూడా పెద్దగా ఏమి లేదు కానీ జనాలు అల్లు శిరీష్ సినిమాను చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

యూత్ సబ్జెక్ట్ అవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా కి దూరం అవ్వగా యూత్ అనుకున్న రేంజ్ లో థియేటర్స్ కి రావడం లేదు, దాంతో వర్కింగ్ డేస్ లో భారీగా స్లో అయిన ఈ సినిమా ఈ వీకెండ్ తేరుకుని భారీ గ్రోత్ ని చూపించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది… మరి ఏం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here