Home న్యూస్ రికార్డులు క్రియేట్ చేయడానికి వస్తున్న భీమ్లా నాయక్ ట్రైలర్…బ్రేక్ చేయాల్సిన టార్గెట్స్ ఇవే!!

రికార్డులు క్రియేట్ చేయడానికి వస్తున్న భీమ్లా నాయక్ ట్రైలర్…బ్రేక్ చేయాల్సిన టార్గెట్స్ ఇవే!!

0

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో భారీ లెవల్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సింది కానీ పాన్ ఇండియా మూవీస్ కోసం పోస్ట్ పోన్ అయ్యి ఫిబ్రవరి 25 న రావాలి అని ఫిక్స్ అయ్యి మధ్యలో వస్తుందా లేదా అన్న డౌట్స్ ఉన్నా కానీ ఇప్పుడు భారీ లెవల్ లో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అయింది ఈ సినిమా….

రీసెంట్ టైం లో సెన్సేషనల్ బజ్ ను సొంతం చేసుకున్న సినిమాలలో రీజనల్ మూవీ నే అయినా హైప్ అల్టిమేట్ లెవల్ లో దక్కించుకున్న భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ జోరు ని చూపెట్టే అవకాశం ఎంతైనా ఉండగా ఇప్పుడు సినిమా…

అఫీషియల్ ట్రైలర్ ముందుగా సోషల్ మీడియా లో రికార్డులను క్రియేట్ చేయడానికి సిద్ధం అవుతుంది. సినిమా ట్రైలర్ పై అంచనాలు కూడా ఓ రేంజ్ లో ఉండగా ఈ ట్రైలర్ తెలుగు లో బ్రేక్ చేయాల్సిన రికార్డులు కూడా కొన్ని ఉన్నాయి అని చెప్పాలి… వ్యూస్ పరంగా కానీ లైక్స్ పరంగా కానీ….

రెండు పాన్ ఇండియా సినిమాలు నమోదు చేసిన రికార్డులను టార్గెట్ చేస్తూ భీమ్లా నాయక్ ట్రైలర్ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. వ్యూస్ పరంగా ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా ట్రైలర్ 24 గంటలలో 23.20 మిలియన్ లైక్స్ ని అందుకుని రికార్డ్ కొట్టగా లైక్స్ పరంగా ఎన్టీఆర్ రామ్ చరణ్ ల ఆర్ ఆర్ ఆర్ సినిమా 24 గంటల్లో….

1.24 మిలియన్ లైక్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది. ఈ రెండు రికార్డులను బ్రేక్ చేయాల్సిన టార్గెట్ తో బరిలోకి దిగుతున్న భీమ్లా నాయక్ ట్రైలర్ ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా రిలీజ్ కాబోతుంది అంటున్నారు కాబట్టి స్టార్టింగ్ కొంచం ఇబ్బంది ఉండొచ్చు కానీ 24 గంటల్లో మాత్రం సంచలనాలు సృష్టించడానికి అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here