Home న్యూస్ సీడెడ్ లో సైరా ఔట్…టాప్ 8 తో సంక్రాంతికి వస్తున్నాం ఎపిక్ జాతర!!

సీడెడ్ లో సైరా ఔట్…టాప్ 8 తో సంక్రాంతికి వస్తున్నాం ఎపిక్ జాతర!!

0

తెలుగు రాష్ట్రాల్లో మాస్ మూవీస్ కి, ఫాక్షన్ మూవీస్ కి ఎక్కువ ఆదరణ లభించే ఏరియా సీడెడ్…టాప్ స్టార్స్ నటించిన మాస్ మూవీస్ కి ఇక్కడ కలెక్షన్స్ సాలిడ్ గా వస్తూ ఉంటాయి, కానీ అప్పుడప్పుడు కొన్ని లాస్ మూవీస్ కూడా ఇక్కడ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకున్నవి ఉన్నాయి. అప్పట్లో అల వైకుంఠ పురంలో లాంటి క్లాస్ మూవీ ఇక్కడ…

ఎపిక్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. లాస్ట్ ఇయర్ కల్కి లాంటి ఎక్స్ పెరిమెంటల్ సైన్స్ ఫిక్షన్ మూవీ సైతం ఇక్కడ రిమార్కబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది….కానీ ఇప్పుడు అసలు ఫామ్ లో లేని సీనియర్ హీరో అయిన విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ….

Sankranthiki Vasthunam 31 Days Total WW Collections!!

అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రాయలసీమ ఏరియాలో ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించడం మరో లెవల్ మాస్ రచ్చ అని చెప్పాలి…ఈ సినిమా సీడెడ్ ఏరియాలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్మ లేపుతూ…

ప్రీవియస్ రికార్డ్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను బ్రేక్ చేస్తూ రాగా లేటెస్ట్ గా అల వైకుంఠ పురంలో, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాల టోటల్ షేర్ ను క్రాస్ చేయగా ఇప్పుడు సినిమా ఇక్కడ సీనియర్ హీరోల సినిమాల్లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న…

సైరా నరసింహా రెడ్డి సినిమా టోటల్ షేర్ ని క్రాస్ చేసింది. సైరా నరసింహా రెడ్డి సినిమా టోటల్ రన్ లో 19.11 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా…లాంగ్ రన్ లో సూపర్ స్టడీ కలెక్షన్స్ తో 5 వారాల బాక్స్ ఆఫీస్ స్టడీ రన్ ని సొంతం చేసుకున్న సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఇప్పుడు సైరా మూవీ…

టోటల్ రన్ షేర్ ని బ్రేక్ చేసి 19.15 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని సీనియర్స్ లో ఎపిక్ రికార్డ్ ను నమోదు చేయగా, ఓవరాల్ గా రాయలసీమ ఏరియాలో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాల్లో టాప్ 8 ప్లేస్ ను అందుకుంది. 7వ ప్లేస్ లో ఉన్న కల్కి 21.8 కోట్ల షేర్ తో ఉండగా..

ఆ మార్క్ ని ఇక అందుకోవడం అసాధ్యం కాబట్టి ఓవరాల్ గా రాయలసీమలో ఆల్ టైం షేర్ మూవీస్ లో 8వ ప్లేస్ లో సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది. ఇక అప్ కమింగ్ సీనియర్ హీరోల సినిమాల్లో ఈ రికార్డ్ ను ఏ సినిమా అందుకోగలుగుతుందో చూడాలి ఇప్పుడు….

Sankranthiki Vasthunam 11 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here