బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఊరమాస్ లాంగ్ రన్ ని ఎంజాయ్ చేస్తూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా నాలుగో వీక్ లో కూడా మంచి షేర్స్ ని సొంతం చేసుకుంటూ మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉండగా…
సినిమా క్లాస్ కంటెంట్ కి మాస్ సెంటర్స్ లో కూడా భీభత్సం సృష్టించే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండటం మామూలు విషయం కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఊరమాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రాయలసీమ ఏరియాలో వన్ ఆఫ్ ది..
హైయెస్ట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా లేటెస్ట్ గా సీడెడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న టాప్ మూవీస్ లో ఒక్కో సినిమా రికార్డ్ ను బ్రేక్ చేస్తూ ఉండగా లేటెస్ట్ గా అక్కడ రెండేళ్ళ క్రితం సంక్రాంతికి ఊరమాస్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన..
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని బ్రేక్ చేసింది. ఆ సినిమా టోటల్ రన్ లో 18.35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా ఇప్పుడు 23 రోజులు పూర్తి అయ్యే టైంకి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా 18.4 కోట్ల రేంజ్ లో….
షేర్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. ఇప్పటికీ సూపర్ స్టడీగా కలెక్షన్స్ ని రాబడుతున్న ఈ సినిమా తర్వత టార్గెట్ మెగాస్టార్ నటించిన సైరా నరసింహా రెడ్డి 19.11 కోట్ల దాకా ఉండగా మిగిలిన రన్ లో కొత్త సినిమాల నుండి పోటి ని తట్టుకుని….
సంక్రాంతికి వస్తున్నాం సినిమా కనుక ఈ మార్క్ ని అందుకోగలిగితే ఓవరాల్ గా సీడెడ్ ఏరియాలో ఆల్ టైం హైయెస్ట్ షేర్ ని అందుకున్న సినిమాల్లో ఏకంగా ఆల్ టైం టాప్ 8 ప్లేస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. మరి సినిమా ఫైనల్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.