Home న్యూస్ మజిలీ టోటల్ థియేటర్స్…న్యూ రికార్డ్!

మజిలీ టోటల్ థియేటర్స్…న్యూ రికార్డ్!

0

    

అక్కినేని నాగ చైతన్య హీరోగా అక్కినేని సమంత హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మజిలీ ప్రేక్షకుల ముందుకు మరి కొన్ని గంటల్లో రాబోతుండగా సినిమా ఇప్పటికే భారీ ఎత్తున రిలీజ్ అవుతుండటం, భారీ బిజినెస్ ని కూడా సొంతం చేసుకోవడం తో ఇప్పుడు ఎన్ని థియేటర్స్ లో సినిమా రిలీజ్ అవుతుంది అన్నది ఆసక్తి గా మారింది, అఫీషియల్ లెక్కలు రిలీజ్ రోజున కన్ఫాం కానుండగా ఓవరాల్ థియేటర్స్ కౌంట్ ఇలా ఉండనుంది.

నైజాం లో సినిమా ఏకంగా 250 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానున్నట్లు సమాచారం, ఇక ఆంధ్ర మరియు సీడెడ్ లలో ఏకంగా 500 వరకు థియేటర్స్ లో మజిలీ రిలీజ్ కాబోతుంది, దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో నే ఏకంగా సినిమా 750 వరకు…

థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో టోటల్ గా 150 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా ఓవర్సీస్ మొత్తం మీద సుమారు 165 లోకేషన్స్ లో సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం. దాంతో వరల్డ్ వైడ్ గా మజిలీ సినిమా ఏకంగా…

1060 వరకు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది, నాగ చైతన్య కెరీర్ లో తొలిసారి పక్కా గా 1000 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న సినిమా గా మజిలీ సినిమా కెరీర్ బెస్ట్ రికార్డు తో దుమ్ము లేపుతుందని చెప్పాలి, సమ్మర్ ఫస్ట్ బిగ్ రిలీజ్ అవ్వడం తో…

సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రేంజ్ లో కలెక్షన్స్ ని వసూల్ చేయడం ఖాయమని చెప్పాలి, ఇక బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ వివరాలను మరో ఆర్టికల్ లో తెలియజేస్తాం. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here