Home న్యూస్ మజిలీ సెన్సార్ టాక్….ఇది చైతు రంగస్థలం అంట!!

మజిలీ సెన్సార్ టాక్….ఇది చైతు రంగస్థలం అంట!!

0

   

  మరి కొన్ని గంటల్లో అక్కినేని నాగ చైతన్య హీరోగా అక్కినేని సమంత హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మజిలీ ప్రేక్షకుల ముందుకు భారీ గా రాబోతుండగా సినిమా పై ఇండస్ట్రీ లో మంచి పాజిటివ్ బజ్ ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే, కాగా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తీ చేసుకున్న ఈ సినిమా కి అక్కడ నుండి యు/ఏ సర్టిఫికెట్ లభించగా సినిమా ఓవరాల్ రన్ టైం వివరాలు ఇలా ఉన్నాయి.

ఓవరాల్ గా 2 గంటల 33 నిమిషాల రన్ టైం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మజిలీ సినిమా చూసిన సెన్సార్ వారి నుండి అద్బుతమైన రెస్పాన్స్ ఇస్తున్నట్లు తెలుస్తుంది, అన్ డౌటెడ్ గా ఇది నాగ చైతన్య కెరీర్ లోనే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా అని అంటున్నారు.

ప్రేమ, క్రికెట్ ని కోల్పోయిన క్యారెక్టర్ లో చైతన్య అద్బుతంగా నటించాడని, భర్త ని చాలా ఇష్టపడే రోల్ లో సమంత ఆకట్టుకుందని, సంగీతం, ఫ్రెష్ లుక్స్, సినిమాటోగ్రఫీ ఇలా అన్నీ ఆకట్టుకున్నాయి, డైరెక్టర్ మొదటి సినిమా నిన్నుకోరి రేంజ్ లో హార్ట్ టచింగ్ స్టొరీ తో…

మెప్పించడమే కాకుండా మాస్ ని కూడా ఆకట్టుకునే విధంగా కొన్ని ఫైట్స్ ని పెట్టి మెప్పించాడని అంటున్నారు, ఓవరాల్ గా సెన్సార్ వారి నుండి సినిమా కి టాక్ బాగుండటం తో ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా జోరు ఎలా ఉంటుంది అన్నది ఆసక్తి గా మారింది.

ఫైనల్ గా రామ్ చరణ్ కి పెర్ఫార్మెన్స్ వైస్ రంగస్థలం ఎలా నిలిచి పోతుందో నాగ చైతన్య కి మజిలీ సినిమా కూడా అదే విధంగా నిలిచి పోతుంది అని వారు చెప్పారట. ఇక బాక్స్ ఆఫీస్ ఫేట్ ఎలా ఉంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here