బాక్స్ ఆఫీస్ దగ్గర హాట్రిక్ విజయాలతో మాస్ రచ్చ చేసిన నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) ఈ సంక్రాంతికి సందడి చేసి బాలయ్య కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచినప్పటికీ కూడా పోటి లో ఉన్న సంక్రాంతికి వస్తున్నాం..
సినిమా ఊరమాస్ జాతర ముందు స్లో అవ్వక తప్పలేదు. దాంతో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటలేక పోయింది. అయినా బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అవ్వగా ఇక్కడ ఎక్స్ లెంట్ వ్యూవర్ షిప్ తో మాస్ రచ్చ చేస్తూ ఉండగా..
ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా సినిమా కి అప్లాజ్ వస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి…సౌత్ లో ఇతర భాషల ఆడియన్స్ కూడా సినిమా ను సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో మెచ్చుకుంటూ ఉండటం, బాలయ్య ఎక్స్ లెంట్ స్క్రీన్ ప్రజెన్స్ అండ్ హీరోయిజం సీన్స్…వాటికి తమన్ కొట్టిన బ్యాగ్రౌండ్ స్కోర్ తో..
సోషల్ మీడియా మొత్తం డాకు మహారాజ్ ఎలివేషన్ వీడియోలతో నిండిపోయింది అని చెప్పాలి. దాంతో నెట్ ఫ్లిక్స్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం కాగా నెట్ ఫ్లిక్స్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవ్వడమే కాకుండా సినిమా ఇతర దేశాల్లో కూడా ట్రెండ్ అవుతూ దుమ్ము లేపుతుంది…
ఏకంగా 18 దేశాల్లో సినిమా టాప్ ట్రెండ్స్ లో ఒకటిగా దూసుకు పోతూ ఉండగా అన్ని చోట్లా సినిమా కి సాలిడ్ రెస్పాన్స్ సొంతం అవుతూ ఉండటం రీసెంట్ టైంలో బాలయ్య మూవీస్ లో అఖండ తర్వాత మళ్ళీ ఈ సినిమాకే సొంతం అయ్యింది అని చెప్పొచ్చు. థియేటర్స్ లో కూడా సోలో రిలీజ్ సొంతం అయ్యి ఉంటే సినిమాకి అక్కడ కూడా ఇంకా బెటర్ రిజల్ట్ సొంతం అయ్యి ఉండేది అని చెప్పొచ్చు.