Home న్యూస్ ఫస్ట్ డే డియర్ కామ్రేడ్ షాకింగ్ కలెక్షన్స్ రిపోర్ట్!

ఫస్ట్ డే డియర్ కామ్రేడ్ షాకింగ్ కలెక్షన్స్ రిపోర్ట్!

1261
0

     విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా సినిమా ఓవరాల్ టాక్ యావరేజ్ టు ఎబో యావరేజ్ గా ఉండగా ఓపెనింగ్స్ పరంగా సినిమా మరీ అద్బుతాలు సృష్టించడంలో మాత్రం కొద్దిగా వెనకబడింది అని చెప్పాలి. ముందుగా ఓవర్సీస్ ప్రీమియర్ షోల ద్వారా సినిమా 300K డాలర్స్ కి పైగా వసూల్ చేసి విజయ్ కెరీర్ లో 2 వ బెస్ట్ గా నిలిచింది.

ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా ఓపెనింగ్స్ డిఫెరెంట్ గా ఉన్నాయి. క్లాస్ సెంటర్స్ లో బాగానే ఉన్నప్పటికీ మాస్ సెంటర్స్ లో షో షో కి కలెక్షన్స్ ఫ్లో తగ్గుతూ వచ్చింది, అప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగినా మాస్ సెంటర్స్ లో పెద్దగా ఇంపాక్ట్ అయితే కనిపించలేదు.

మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల కి ఫైనల్ గా 55% వరకు ఆక్యుపెన్సీ దక్కగా ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి 65% లోపు ఆక్యుపెన్సీ ని సినిమా సొంతం చేసుకుంది. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ మాస్ సెంటర్స్ లో యావరేజ్ గా ఉండగా క్లాస్ సెంటర్స్ మాత్రం బాగానే ఉన్నాయి.

ఓవరాల్ గా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా సినిమా ఒకింత షాక్ ని కలిగించేలా ఉందని చెప్పొచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్లకు పైగా షేర్ కన్ఫాం అయినా 6 కోట్ల లోపు ఉండే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి. కానీ సినిమా రిలీజ్ అయిన రేంజ్(750+) కి మినిమం 8 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ క్రేజ్ దృశ్యా సొంతం చేసుకోవాల్సింది.

మరి నైట్ షోల పూర్తి లెక్కలు అంచనా కి మించి ఆ మార్క్ కి చేరువగా వెలుతుందేమో చూడాలి. ఇక వరల్డ్ వైడ్ గా మాత్రం 9 కోట్ల నుండి 10 కోట్ల రేంజ్ కి అటూ ఇటూ గా కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉంది. మరి మొదటి రోజు సినిమా అఫీషియల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

avatar
  Subscribe  
Notify of