విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ బాక్స్ అఫీస్ దగ్గర నేడు భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా సినిమా ఓవర్సీస్ లో ఎబో యావరేజ్ టాక్ ని సొంతం చేసుకోగా రెగ్యులర్ షోలకి యావరేజ్ టు ఎబో యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ టాక్ సోషల్ మీడియా లో అలాగే బయట భారీ ఎత్తున స్ప్రెడ్ అవ్వగా ఆ ఎఫెక్ట్ ఓపెనింగ్స్ పై కూడా ఇంపాక్ట్ చూపుతుందని చెప్పొచ్చు.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కి ముందు అడ్వాన్స్ బుకింగ్స్ ఓవరాల్ గా 50% కి పైగా జరిగింది, అందులో మాస్ సెంటర్స్ మరింత జోరుగా బుకింగ్స్ జరిగి ఉంటే 60% కన్నా ఎక్కువ బుకింగ్స్ జరిగి ఉండేవి. కానీ సినిమా క్లాస్ మూవీ అవ్వడంతో అక్కడ ఎఫెక్ట్ పడింది.
అది క్లియర్ అయ్యి సినిమా అక్కడ కూడా దుమ్ము లేపే ఓపెనింగ్స్ ని అందుకోవాలి అంటే సినిమా కి అల్ట్రా పాజిటివ్ టాక్ తప్పనిసరి గా మారింది. కానీ సినిమా టాక్ మార్నింగ్ షో అయ్యే సరికే టోటల్ గా స్ప్రెడ్ అవ్వడం తో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల సమయానికి మాస్ సెంటర్స్…
అనుకున్న రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోలేదు. ఆ ఏరియాల్లో షాక్ తిన్నా మిగిలిన ఏరియాల్లో డియర్ కామ్రేడ్ మంచి ఓపెనింగ్స్ నే సొంతం చేసుకుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా నైజాం లో అద్బుతమైన ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల లో కూడా జోరు చూపే అవకాశం ఉంది.
ఈవెనింగ్ అండ్ నైట్ షోలలో సినిమా జోరు అన్ని సెంటర్స్ లో కొనసాగితే సినిమా 5.5 కోట్ల నుండి 6 కోట్లు అందుకునే చాన్స్ ఉంది. మాస్ సెంటర్స్ ఇంపాక్ట్ చూపక పొతే కనుక సినిమా 5 కోట్ల నుండి 5.5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని సాధించవచ్చు. మరి రోజు ముగిసే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.