Home న్యూస్ AP లో కల్కి ఔట్….దేవర ఎపిక్ మాస్ ఊచకోత!!

AP లో కల్కి ఔట్….దేవర ఎపిక్ మాస్ ఊచకోత!!

0
Devara Breaks Kalki 2898 AD Total Collections in Andhra Pradesh
Devara Breaks Kalki 2898 AD Total Collections in Andhra Pradesh

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మిక్సుడ్ రెస్పాన్స్ తో ఓపెన్ అయినా కూడా లాంగ్ రన్ లో ఊహకందని కలెక్షన్స్ ని అందుకుంటూ మాస్ రచ్చ చేస్తున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) అన్ని చోట్లా మాస్ కలెక్షన్స్ తో 25 రోజులను పూర్తి చేసుకుని భారీ లాభాలను అందుకుంది…

ఈ క్రమంలో సినిమా తెలుగు రాష్ట్రాలలో అలాగే వరల్డ్ వైడ్ గా కూడా వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న టాలీవుడ్ మూవీస్ లో ఒకటిగా సంచలనం సృష్టించింది. ఇక ఈ ఇయర్ బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో ఇండియా నంబర్ 1 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన…

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898 AD) మూవీ టోటల్ రన్ ఆంధ్రప్రదేశ్ కలెక్షన్స్ ని దేవర మూవీ బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది…తెలంగాణ లో కల్కి మూవీ ఎపిక్ కలెక్షన్స్ ని దేవర అందుకోలేక పోయింది.

రెండు సినిమాల మధ్య దూరం భారీగానే ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దేవర మూవీ కల్కి టోటల్ కలెక్షన్స్ ని దాటేసింది… కల్కి మూవీ తెలంగాణా కలెక్షన్స్ కాకుండా ఒక్క ఆంధ్రప్రదేశ్ కలెక్షన్స్ టోటల్ రన్ లో 94.47 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే…

Kalki 2898 AD Movie Total World Wide Collections!!

25 రోజుల్లో దేవర మూవీ 97.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది. రెండు సినిమాలకు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ హైక్స్ ఉన్నా దేవర కి టికెట్ హైక్స్ మరింత ఎక్కువగా ఇచ్చారు, కానీ అదే టైంలో సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్, యావరేజ్ రివ్యూలే సొంతం అయినా…

లాంగ్ రన్ లో ఏకంగా కల్కి కలెక్షన్స్ నే బ్రేక్ చేసింది. అదే టైంలో వరల్డ్ వైడ్ గా ఎపిక్ కలెక్షన్స్ ని సాధించిన కల్కి 1000 కోట్ల భీభత్సం సృష్టించగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వాల్యూ బిజినెస్ 103 కోట్లను అందుకోలేక పోయింది….కానీ అదే టైంలో దేవర కల్కి రేంజ్ వరల్డ్ వైడ్ సెన్సేషన్ ని క్రియేట్ చేయకున్నా…

మిక్సుడ్ రెస్పాన్స్ తోనే ఆంధ్రప్రదేశ్ లో వాల్యూ బిజినెస్ 68.55 కోట్ల మీద ఆల్ మోస్ట్ 29 కోట్ల లోపు ప్రాఫిట్ ను సొంతం చేసుకుని రీసెంట్ టైంలో ఆంధ్రప్రదేశ్ లో ఎపిక్ ప్రాఫిట్స్ ను అందుకున్న సినిమాగా నిలిచింది… ఈ సినిమా ఇచ్చిన హోప్ తోనే అప్ కమింగ్ బిగ్ మూవీస్ కి ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పటి రేంజ్ లో భారీ బిజినెస్ ఆఫర్స్ సొంతం అవుతున్నాయని చెప్పొచ్చు…

Devara Movie 24 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here