Home న్యూస్ ఇది షాకే: డే 1 దిల్ రూబ కన్నా డే 8 ఛావా తెలుగు ఎక్కువ!!

ఇది షాకే: డే 1 దిల్ రూబ కన్నా డే 8 ఛావా తెలుగు ఎక్కువ!!

0

బాక్స్ అఫీస్ దగ్గర హోలీ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా మంచి ప్రమోషన్స్ ను జరుపుకుని రిలీజ్ అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ మూవీ అయిన దిల్ రూబ(Dilruba Movie) సినిమా రిపోర్ట్స్ పర్వాలేదు అనిపించేలా ఉండగా ఓపెనింగ్స్ హాలిడే రోజున అవ్వడంతో…

కచ్చితంగా జోరు చూపిస్తాయి అనుకున్నా కూడా అలా ఏమి జరగలేదు. సినిమా మొదటి రోజున బుక్ మై షో లో టికెట్ సేల్స్ పరంగా ఓవరాల్ గా ఈ వీకెండ్ వచ్చిన మూవీస్ లో లీస్ట్ పెర్ఫార్మెన్స్ ను చూపించిన సినిమా నిలిచింది. కోర్ట్ మూవీ అంచనాలను మించి..

బాక్స్ ఆఫీస్ దగ్గర వీర లెవల్ లో కుమ్మేసింది. ఇక రెండో వారంలో ఉన్న ఛావా తెలుగు డబ్ థియేటర్స్ ను కొంతవరకు ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాల కోసం కోల్పోవాల్సి వచ్చినా కూడా ఉన్నంతలో ఉన్న థియేటర్స్ లోనే ఆ సినిమా ఎక్స్ లెంట్ గా జోరు చూపించింది ఇప్పుడు…

ఏకంగా దిల్ రూబ సినిమా మొదటి రోజు టికెట్ సేల్స్ కన్నా కూడా డే 8 లో ఉన్న ఛావా టికెట్ సేల్స్ తెలుగు లో ఎక్కువగా తెగడం అందరినీ ఆశ్యర్యపరిచింది…దిల్ రూబ సినిమా కి మొదటి రోజున 9 వేల రేంజ్ లోనే టికెట్ సేల్స్ జరిగాయి. అదే టైంలో ఛావా సినిమా కి వచ్చేసరికి…

8వ రోజులో ఉన్నప్పటికీ కూడా ఏకంగా 14 వేల లోపు టికెట్ సేల్స్ సొంతం అయ్యి ఎక్స్ లెంట్ గా జోరు ని చూపించి లిమిటెడ్ థియేటర్స్ లోనే మాస్ రాంపెజ్ ను చూపించడం విశేషం. ఓవరాల్ గా క లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దిల్ రూబ సినిమా ఆశించిన ఓపెనింగ్స్ ను అందుకోలేదు. ఇక వీకెండ్ లో వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here