Home న్యూస్ అక్షరాలా 1700 కోట్లు…ఊచకోత కోస్తున్న గాడ్జిల్లా X కాంగ్2!!

అక్షరాలా 1700 కోట్లు…ఊచకోత కోస్తున్న గాడ్జిల్లా X కాంగ్2!!

0

వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర గాడ్జిల్లా X కాంగ్2(Godzilla x Kong: The New Empire India Collections) సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉంది… సినిమా ఇటు ఇండియాలో కూడా అద్బుతమైన హోల్డ్ ని వర్కింగ్ డే లో కూడా చూపించి దుమ్ము లేపగా వరల్డ్ వైడ్ గా సినిమా…

అక్షరాలా 200 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటేసి సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది. ఇండియా లో సినిమా 4 రోజుల్లో 45 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా టోటల్ ఇండియా గ్రాస్ 53 కోట్ల రేంజ్ లో ఉండటం విశేషం అని చెప్పాలి. తమిళ్ లో సినిమాలు ఏమి లేక పోవడంతో అక్కడ జనాలు…

ఈ సినిమాను ఎగబడి చూస్తూ ఇప్పటి వరకు 12 కోట్ల గ్రాస్ ను సొంతం అయ్యేలా చేశారు. తెలుగులో సినిమా 7.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది… ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1700 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇప్పుడు 2 వేల కోట్ల వైపు పరుగులు పెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.

ఇక ఇండియాలో పోటిలో కూడా మంచి జోరుని చూపెడుతున్న ఈ సినిమా 60-70 కోట్ల రేంజ్ లో లైఫ్ టైం నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. చిన్న పిల్లలు ఎగబడి థియేటర్స్ లో సినిమాను చూస్తూ ఉండటంతో లాంగ్ రన్ కూడా సినిమాకి సొంతం అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. మరి సమ్మర్ అడ్వాంటేజ్ తో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here