బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly Movie) మూవీ భారీ లెవల్ లో గురువారం రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా వరల్డ్ వైడ్ గా సుమారు 116 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా…
మరోసారి ప్రమోషన్స్ లాంటివి పెద్దగా ఏమి జరగకున్నా కూడా అజిత్ కుమార్ పేరు పవర్ మీద ఎక్స్ లెంట్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఈ సినిమా తమిళనాడులో ఓవరాల్ గా ఇప్పటి వరకు 14 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా…
తెలుగు లో యావరేజ్ రేంజ్ లోనే బుకింగ్స్ ను అందుకోగా కర్ణాటక కేరళలో పర్వాలేదు అనిపించేలా బుకింగ్స్ ఉన్నాయి….మొత్తం మీద రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 3 కోట్ల రేంజ్ లో బుకింగ్స్ ను సొంతం చేసుకోగా ఓవర్సీస్ బుకింగ్స్ తో కలిపి…
సినిమా వరల్డ్ వైడ్ గా 24 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను ఇప్పటి వరకు సొంతం చేసుకోగా వీకెండ్ కి గాను ఓవరాల్ గా 32 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడున్న ఊపు చూస్తూ ఉంటే మొదటి రోజున తమిళనాడులో…
25-28 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా టాక్ ను బట్టి కలెక్షన్స్ లెక్క 30 కోట్ల రేంజ్ కి కూడా వెళ్ళే అవకాశం ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 5-6 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో 1.5-1.8 మిలియన్ డాలర్స్ దాకా…
ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 46-50 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక టాక్ సాలిడ్ గా ఉంటే లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరి సినిమా ఏ రేంజ్ లో ఓపెనింగ్స్ ను సాధిస్తుందో చూడాలి ఇక…