టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram) భారీ అంచనాల నడుమ సంక్రాంతికి రిలీజ్ అవ్వగా మహేష్ త్రివిక్రమ్ ల క్రేజీ కాంబోలో వచ్చిన హాట్రిక్ మూవీ అవ్వడంతో అంచనాలు మరీ ఎక్కువగా ఉండటం కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత…
మిక్సుడ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా సినిమా సోషల్ మీడియాలో మాత్రం భారీగా నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయినా కూడా సినిమా లాంగ్ రన్ లో 100 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకోవడం విశేషమని చెప్పాలి. కానీ సినిమా ఓవరాల్ గా మాత్రం బ్రేక్ ఈవెన్ ని అందుకోలేక పోయింది….
అయినా కానీ మొదటి రోజు వచ్చిన మిక్సుడ్ టాక్ తో కూడా సినిమా చాలా వరకు రికవరీని సొంతం చేసుకోవడం విశేషం అనే చెప్పాలి. ఒకసారి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే….
Guntur Kaaram Total World Wide Collections(Inc GST)
👉Nizam: 33.85Cr
👉Ceeded: 9.75Cr
👉UA: 12.65Cr
👉East: 9.80Cr
👉West: 6.00Cr
👉Guntur: 8.30Cr
👉Krishna: 6.48Cr
👉Nellore: 3.67Cr
AP-TG Total:- 90.50CR(139.80CR~ Gross)
👉KA+ROI:- 6.56Cr
👉OS: 14.75Cr***
Total WW:- 111.81CR(184.05CR~ Gross)
(84%~ Recovery)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి 21.19 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుంది, కానీ ఓవరాల్ గా రికవరీ 84% వరకు ఉండటంతో సినిమా యావరేజ్ రిజల్ట్ తో రన్ ని కంప్లీట్ చేసుకుంది. డిసాస్టర్ అవుతుంది అనుకున్న సినిమా యావరేజ్ రిజల్ట్ ను ఓవరాల్ గా అందుకోవడం కూడా విశేషం అనే చెప్పాలి.