బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హిట్స్ తో ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోలలో సెన్సేషనల్ ఫామ్ తో దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) లాస్ట్ ఇయర్ సరిపోదా శనివారంతో 100 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేయగా ఇప్పుడు కంప్లీట్ గా డిఫెరెంట్ జానర్ లో ఆడియన్స్ ముందుకు…
ఎప్పుడు రాని విధంగా బ్రూటల్ మాస్ రాంపెజ్ ను చూపెడుతూ హిట్ సిరీస్ లో భాగంగా వస్తున్న హిట్3(Hit 3 Movie) తో రచ్చ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. మే 1 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మీద ఆల్ రెడీ మంచి అంచనాలు ఉండగా…
ఆల్ రెడీ రిలీజ్ అయిన టీసర్ సినిమా మీద అంచనాలను పెంచగా ఇప్పుడు సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ మరీ టీసర్ రేంజ్ లో వైలెంట్ గా లేక పోయినా కూడా బ్రూటల్ మాస్ సీన్స్ తో నిండిపోయిన హిట్3 సినిమా ట్రైలర్ ఓవరాల్ గా…
సినిమా మీద ఉన్న అంచనాలను అయితే సాలిడ్ గా పెంచేసింది అని చెప్పాలి…. సినిమా స్టోరీ పాయింట్ ను కూడా ట్రైలర్ లో రివీల్ చేశారు….9 నెలల పాప నుండి అనేక మందిని కిడ్పాన్ చేస్తూ ఎవ్వరూ గెస్ చేయాలనీ ప్లేస్ లో పెడతారు…వాళ్ళందరినీ కాపాడే పనిలో…
పోలిస్ అయిన హీరో ఏం చేశాడు….ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మొత్తం మీద టీసర్ మోస్ట్ వైలేంట్ గా ఉండగా ట్రైలర్ లో మాత్రం కొంచం స్టోరీని రివీల్ చేస్తూ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పారు..
ట్రైలర్ లో కూడా నాని బ్రూటల్ మాస్ రాంపెజ్ ను చూపించగా, కెరీర్ లో ఎప్పుడూ లేనంత వైలెంట్ గా కనిపించిన నాని ఈ సారి అంచనాలను మించిపోయేలా మెప్పించబోతున్నాడు అని చెప్పాలి. ట్రైలర్ ఉన్న రేంజ్ లో సినిమా ఉంటే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్3 మాస్ ఊచకోత కోయడం ఖాయమని చెప్పాలి.