బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస విజయాలతో టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో సెన్సేషనల్ ఫామ్ తో దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) మే 1 న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద ఆడియన్స్ లో కూడా అంచనాలు పెరిగి పోతూ ఉండటం విశేషం.
కాగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి. ఇక ట్రైలర్ టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాల రికార్డులను అన్నింటినీ వ్యూస్ పరంగా బ్రేక్ చేసి సంచలనం సృష్టించడం విశేషం.
టాలీవుడ్ మీడియం రేంజ్ మూవీస్ లో యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లైగర్(Liger Movie) అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు 24 గంటల్లో 16.8 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని రికార్డ్ కొట్టగా… కొంత టైంగా ఈ రికార్డ్…
ఇలానే కొనసాగగా ఇప్పుడు మంచి హైప్ నడుమ వస్తున్న నాని హిట్3 మూవీ ట్రైలర్ 24 గంటలు కూడా పూర్తి అవ్వకముందే ఈ రికార్డ్ ను బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. అలాగే టాలీవుడ్ మీడియం రేంజ్ మూవీస్ ట్రైలర్ లలో మొదటి సారిగా 20 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను…
24 గంటల లోపే అందుకున్న మొదటి ట్రైలర్ గా రికార్డ్ ను నమోదు చేయడం విశేషం అయితే అలాగే టాలీవుడ్ టాప్ ట్రైలర్ రికార్డులలో కూడా ఒకటిగా దూసుకు పోతున్న హిట్3 ట్రైలర్ సినిమా మీద ఉన్న అంచనాలను అమాంతం పెంచేయగా…
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మే 1 న ఓపెనింగ్స్ పరంగా కూడా సినిమా మాస్ ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉంది. ఇక హిట్3 సినిమా అఫీషియల్ ట్రైలర్ నెలకొల్పిన ఈ రికార్డ్ ను ఫ్యూచర్ లో ఏ సినిమా బ్రేక్ చేసే అవకాశం ఉంటుందో చూడాలి ఇప్పుడు.